News April 1, 2024
FAKE ALERT: ఓయూ హాస్టల్ ఫుడ్‌లో పురుగు

ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉమెన్స్ హాస్టల్‌లోని ఫుడ్‌లో గొంగళి పురుగు వచ్చిందని కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. దీనిపై ఓయూ అధికారులు స్పందించారు. ‘హాస్టల్ ఫుడ్‌లో గొంగళి పురుగు వచ్చిందనేది తప్పు. ఇక్కడి హాస్టల్‌లో అరటి ఆకులపై ఆహారం అందించట్లేదు. ఇది ఫేక్. ఇలాంటి తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. షేర్ చేసే ముందు ధ్రువీకరించుకోండి’ అని ట్వీట్ చేశారు.
Similar News
News March 20, 2026
‘ధురంధర్-2’తో ఆ డైరెక్టర్లు బెదిరిపోతారు: RGV

‘ధురంధర్-2’పై మరోసారి ప్రశంసలు కురిపించిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ రొటీన్ సినిమాలు తీసే దర్శకులపై ఫైర్ అయ్యారు. హీరోలను దేవుడిలా కొలుస్తూ ఫిజిక్స్, గ్రావిటీతో సంబంధం లేని చిత్రాలు తీసే డైరెక్టర్లకు ఇది వణుకుపుట్టిస్తుందన్నారు. దీంతో అసలైన హీరోయిజం పుట్టిందని.. ఇప్పుడు రొటీన్ స్టార్ హీరోలంతా జోకర్లుగా కనిపిస్తున్నారని విమర్శించారు. రొటీన్ యాక్షన్ మూవీలను ఇకపై ఆడియన్స్ చూడరని ట్వీట్ చేశారు.
News March 20, 2026
ఆసీస్ ప్లేయర్లు కావాలనే రావడం లేదా?

IPL ఆరంభ మ్యాచులకు కమిన్స్(SRH), స్టార్క్(DC), హేజిల్‌వుడ్(RCB) రావడం లేదు. ఎల్లిస్(CSK) సీజన్ మొత్తానికి దూరమయ్యారు. గాయాల భయంతో ఆస్ట్రేలియన్లు IPL ఆడేందుకు ఇష్టపడడం లేదని, కావాలనే మ్యాచులకు డుమ్మా కొడుతున్నట్లు కొందరు IND ఫ్యాన్స్ అంటున్నారు. ఫ్రాంచైజీల నుంచి రూ.కోట్లు తీసుకుంటూ స్వదేశం తరఫున ఆడేందుకే మొగ్గు చూపుతున్నారు. అలాంటప్పుడు వేలంలో పాల్గొనడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. మీరేమంటారు?
News March 20, 2026
కాంగ్రెస్‌ది చోర్ విధానం: హరీశ్ రావు

TG: కాంగ్రెస్ హయాంలో తలసరి ఆదాయం, GSDP తగ్గిందని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ‘కాంగ్రెస్‌ది క్యూర్, ప్యూర్, రేర్ విధానం కాదు.. చోర్ విధానం. 6 గ్యారంటీలు అమలు చేశామని సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. BRS హయాంలో తలసరి ఆదాయ వృద్ధి 12.1% ఉంటే ఇప్పుడు 10.2%గా ఉంది. కాంగ్రెస్ వైఫల్యం వల్లే ఇది తగ్గింది. బడ్జెట్ ద్వారా ఈ ప్రభుత్వ చేతగానితనం అర్థమైంది’ అని ప్రెస్‌మీట్‌లో ఫైరయ్యారు.


