News August 21, 2025
భారీగా తగ్గనున్న పాలసీల ధరలు!

ఆరోగ్య, వ్యక్తిగత జీవిత బీమా ప్రీమియం ధరలు తగ్గనున్నాయి. ఈ పాలసీలను GST నుంచి మినహాయించాలని మోదీ సర్కారు ప్రతిపాదించినట్లు బీమాపై ఏర్పాటైన మంత్రుల బృందం కన్వీనర్ సామ్రాట్ చౌదరి తెలిపారు. అన్ని రాష్ట్రాలు దీనికి సుముఖత వ్యక్తం చేసినట్లు, త్వరలోనే GST కౌన్సిల్‌కు ఈ అంశంపై నివేదిక ఇస్తామన్నారు. ఇది అమలైతే కేంద్రానికి పన్ను రాబడి రూ.9,700కోట్ల వరకు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ పాలసీలపై 18% GST ఉంది.
Similar News
News August 21, 2025
సాయంత్రం ఢిల్లీకి సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు ఇవాళ సాయంత్రం ఢిల్లీకి బయల్దేరనున్నారు. రేపు మ.2 గంటలకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆయన భేటీ అవుతారు. రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆమెకు వివరించి ఆర్థిక సాయం కోరనున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని ఓ ప్రైవేటు హోటల్‌లో ఎకనమిక్ టైమ్స్ నిర్వహించే వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సుకు సీఎం హాజరవుతారు. రాత్రి అమరావతికి తిరుగు పయనమవుతారు.
News August 21, 2025
NDAకు మద్దతు ఇస్తున్నాం: బొత్స

AP: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో NDA అభ్యర్థికి YCP మద్దతిస్తున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు. నంబర్ గేమ్ ఉండొద్దనే తాము ఈ నిర్ణయం తీసుకున్నామని, పార్టీ పెట్టినప్పటి నుంచి ఇదే విధానం అమలు చేస్తున్నట్లు చెప్పారు. గతంలో రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీకి తాము మద్దతిచ్చినట్లు బొత్స గుర్తుచేశారు. తమది కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఏర్పడిన పార్టీ అని ఆయన వివరించారు.
News August 21, 2025
నివేదిక రద్దు చేయాలని పిటిషన్లు.. విచారణ వాయిదా

TG: కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను రద్దు చేయాలన్న <<17470256>>కేసీఆర్<<>>, హరీశ్ రావు పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటారా, అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చ తర్వాత చర్యలు తీసుకుంటారా అని కోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ నిర్ణయం చెప్పడానికి సమయం కావాలని ఏజీ కోరగా, విచారణ రేపటికి వాయిదా పడింది.