News August 21, 2025
సాయంత్రం ఢిల్లీకి సీఎం చంద్రబాబు

AP: సీఎం చంద్రబాబు ఇవాళ సాయంత్రం ఢిల్లీకి బయల్దేరనున్నారు. రేపు మ.2 గంటలకు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌తో ఆయన భేటీ అవుతారు. రాష్ట్రంలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ఆమెకు వివరించి ఆర్థిక సాయం కోరనున్నారు. రేపు సాయంత్రం 5 గంటలకు ఢిల్లీలోని ఓ ప్రైవేటు హోటల్‌లో ఎకనమిక్ టైమ్స్ నిర్వహించే వరల్డ్ లీడర్స్ ఫోరం సదస్సుకు సీఎం హాజరవుతారు. రాత్రి అమరావతికి తిరుగు పయనమవుతారు.
Similar News
News March 29, 2026
అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యుల సస్పెండ్

TG: అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ సభ్యులను స్పీకర్ గడ్డం ప్రసాద్ రెండు రోజులపాటు సస్పెండ్ చేశారు. ఇవాళ, రేపు సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే సభలో కడియం శ్రీహరి పట్ల <<19506649>>కౌశిక్ రెడ్డి<<>> వ్యవహరించిన తీరుపై ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేస్తూ అసెంబ్లీ తీర్మానం చేసింది. కౌశిక్ వ్యవహార శైలిని సమర్థిస్తే అసెంబ్లీలో కత్తిపోట్లు జరుగుతాయని, ఇలాంటి ఘటనలను సీరియస్‌గా తీసుకోవాలని సీఎం రేవంత్ అన్నారు.
News March 29, 2026
కాంగ్రెస్ పాలనలో స్కాములపై విచారణ జరిపించండి: BRS

TG: రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో దాదాపు అన్ని శాఖల్లో అక్రమాలు జరిగాయని BRS ఆరోపించింది. ఈ కుంభకోణాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని CM రేవంత్‌కు BRSLP లేఖ రాసింది. 20 స్కాముల పేర్లను లేఖలో పేర్కొంది. అవినీతి, కుంభకోణాలపై లేఖ రాస్తే విచారణ జరిపిస్తానని CM రేవంతే స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారని తెలిపింది. విచారణ జరగాలంటే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.
News March 29, 2026
NBK111.. పవర్‌ఫుల్ రోల్‌లో లక్ష్మీరాయ్?

గోపీచంద్ మలినేని-బాలకృష్ణ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమాలో లక్ష్మీరాయ్ నటించనున్నట్లు సమాచారం. ఇదొక పవర్‌ఫుల్ రోల్ అని, ఆమె ఎంట్రీతోనే కథ మలుపు తిరుగుతుందని టాక్. బాలయ్య-లక్ష్మీ కాంబినేషన్‌లో ‘అధినాయకుడు’ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. కాగా NBK111 చిత్రంలో హీరోయిన్‌గా నయనతార నటిస్తున్నారు. ‘వీరసింహారెడ్డి’ తర్వాత నందమూరి హీరోతో గోపీచంద్ రూపొందించే చిత్రం కావడంతో భారీ అంచనాలున్నాయి.


