News August 22, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News August 22, 2025
జన సైన్యాధ్యక్షుడికి విజయోస్తు: చిరంజీవి

పవన్ <<17475204>>బర్త్‌డే విషెస్<<>>కు చిరంజీవి ఎమోషనల్ రిప్లయ్ ఇచ్చారు. ‘తమ్ముడు కళ్యాణ్ నన్ను చూసి నువ్వెంత గర్విస్తున్నావో.. నీ విజయాల్ని, నీ పోరాటాన్ని నేనూ అంతే ఆస్వాదిస్తున్నా. నీ వెనుకున్న కోట్లాదిమంది జనసైనికులను ఓ రాజువై నడిపించు. వాళ్ల ఆశలకు, కలలకు కొత్త శక్తినివ్వు. నా ఆశీర్వచనాలు నీతోనే ఉంటాయి. ప్రతీ అడుగులోనూ విజయం నిన్ను వరించాలని భగవంతుడ్ని కోరుకుంటున్నా’ అని పోస్ట్ చేశారు.
News August 22, 2025
చిరంజీవి ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తి: CM చంద్రబాబు

మెగాస్టార్ చిరంజీవికి AP CM చంద్రబాబు X వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘చిరంజీవి గారికి 70వ పుట్టిన రోజు శుభాకాంక్షలు. సినిమా, ప్రజా జీవితంలో మీ అద్భుతమైన ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తినిచ్చింది. దాతృత్వం, అంకితభావంతో మీరు ఇలాగే చాలా మంది జీవితాలను స్పృశించడం కొనసాగించాలి. మీకు మంచి ఆరోగ్యం, ఆనందం కలగాలని, రాబోయే ఏళ్లు మరింత చిరస్మరణీయం కావాలని కోరుకుంటున్నా’ అని పేర్కొన్నారు.
News August 22, 2025
మీ ఫోన్‌లో ఇలా అవుతోందా?

పలు ఫోన్లలో కాలింగ్ ఇంటర్‌ఫేజ్ మారింది. కాల్ చేస్తే పెద్ద అక్షరాలు స్క్రీన్‌పై కనిపిస్తున్నాయి. కాల్ రిసీవింగ్, కట్ చేసేందుకు పైకి, కిందకి కాకుండా సైడ్‌కు స్లైడ్ చేయాల్సి వస్తోంది. ఆల్ కాల్స్, మిస్డ్ కాల్స్, కాంటాక్ట్స్, నాన్-స్పామ్, స్పామ్ అని చూపిస్తోంది. రియల్‌మీ, వన్ ప్లస్, మోటో, ఒప్పో, వివో, ఐక్యూ మోడళ్లలో ఈ మార్పులు వచ్చినట్లు తెలుస్తోంది. కొందరు తమకు మార్పులు కనిపించట్లేదని అంటున్నారు.