News August 22, 2025
మెదక్: ‘విద్యారంగాన్ని బలోపేతం చేయాలి’

ప్రభుత్వ పాఠశాలల ద్వారా విద్యారంగాన్ని బలోపేతం చేస్తూ నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని బీసీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి జగదీష్ అన్నారు. మెదక్ పట్టణంలో బీ.సీ బాలికల వసతి గృహాన్ని ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థినిలకు అందిస్తున్న ఆహారం నాణ్యత, తాగునీరు, తరగతి గదులు, వంటశాల, రిజిస్టర్లు, పరిసరాలను పరిశీలించారు. సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News August 22, 2025
మీ ఫోన్‌లో ఇలా అవుతోందా?

పలు ఫోన్లలో కాలింగ్ ఇంటర్‌ఫేజ్ మారింది. కాల్ చేస్తే పెద్ద అక్షరాలు స్క్రీన్‌పై కనిపిస్తున్నాయి. కాల్ రిసీవింగ్, కట్ చేసేందుకు పైకి, కిందకి కాకుండా సైడ్‌కు స్లైడ్ చేయాల్సి వస్తోంది. ఆల్ కాల్స్, మిస్డ్ కాల్స్, కాంటాక్ట్స్, నాన్-స్పామ్, స్పామ్ అని చూపిస్తోంది. రియల్‌మీ, వన్ ప్లస్, మోటో, ఒప్పో, వివో, ఐక్యూ మోడళ్లలో ఈ మార్పులు వచ్చినట్లు తెలుస్తోంది. కొందరు తమకు మార్పులు కనిపించట్లేదని అంటున్నారు.
News August 22, 2025
చిత్తూరు: మెగా DSC ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు సిద్ధం

మెగా DSC పరీక్షల్లో ఎంపికయ్యే అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలించేందుకు చిత్తూరు జిల్లా అధికారులు పకడ్బందింగా ఏర్పాట్లు చేస్తున్నారు. చిత్తూరులోని అపోలో యూనివర్సిటీ, ఎస్‌వీ సెట్ ఇంజనీరింగ్ కళాశాలలను సర్టిఫికెట్ పరిశీలనా కేంద్రాలుగా అధికారులు ఎంపిక చేశారు. జిల్లాలో 1,473 పోస్టులు భర్తీ చేయనున్న నేపథ్యంలో 30 కౌంటర్లను ఏర్పాటు చేశారు.
News August 22, 2025
బాపట్ల: శ్రావణ మాసం చివరి శుక్రవారం.. పూల ధరలకు రెక్కలు

బాపట్లలోని వివిధ ప్రాంతాల్లో శ్రావణ మాసం చివరి శుక్రవారం సందర్భంగా పూల ధరలు మామూలు రేట్ల కంటే డబుల్ అయ్యాయి. నిన్నటిదాకా కిలో మల్లెపూలు రూ.500 – 600 ఉంటే, నేడు కిలో రూ.900 పెట్టి కొనుగోలు చేస్తున్నట్లు వ్యాపారులు తెలిపారు. చామంతి పూలు, చిట్టి రోజాలు కేజీ రూ. 400 -రూ.500 పలుకుతున్నాయి. మల్లెపూలు మూర రూ.50, బంతిపూలు మూర రూ.30 అమ్ముతున్నారు. మరి మీ ప్రాంతంలో ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.