News August 22, 2025
స్వల్పంగా తగ్గిన బంగారం ధర

నిన్న పెరిగిన బంగారం ధరలు ఇవాళ కాస్త తగ్గాయి. HYD బులియన్ మార్కెట్‌లో ఇవాళ 24 క్యారెట్ల పసిడి 10 గ్రాములపై రూ.220 తగ్గి రూ.1,00,530కు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములపై రూ.150 పతనమై రూ.92,150 పలుకుతోంది. అటు KG వెండి ధరపై రూ.2,000 పెరిగి రూ.1,28,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
Similar News
News August 22, 2025
రూ.5,000కోట్లు కేటాయించండి: సీఎం చంద్రబాబు

AP: ప్రత్యేక మూలధన పెట్టుబడి సహాయం(SASCI) కింద రాష్ట్రానికి మరో రూ.5వేల కోట్లు కేటాయించాలని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను CM CBN కోరారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు రూ.2,010CR అందాయని తెలిపారు. అలాగే సింగిల్ నోడల్ ఏజెన్సీ ప్రోత్సాహక పథకం మార్గదర్శకాల మేరకు రూ. 250CR విడుదలకు ఉత్తర్వులివ్వాలని కోరారు. కేంద్రం ప్రకటించిన పూర్వోదయ పథకానికి త్వరగా విధివిధానాలు రూపొందించి అమల్లోకి తేవాలని సూచించారు.
News August 22, 2025
కేసీఆర్‌తో హరీశ్‌రావు భేటీ

TG: ఎర్రవల్లిలోని తన నివాసంలో మాజీ మంత్రి హరీశ్‌రావుతో కేసీఆర్ సమావేశమయ్యారు. కాళేశ్వరం కమిషన్ నివేదికపై హైకోర్టులో <<17482025>>విచారణ <<>> జరుగుతున్న నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. తదుపరి కార్యాచరణపై హరీశ్ సహా మిగతా బీఆర్ఎస్ నేతలతో గులాబీ దళపతి సమాలోచనలు చేస్తున్నారు.
News August 22, 2025
వైద్యశాఖలో 1,623 ఉద్యోగాలకు నోటిఫికేషన్

TG: రాష్ట్రంలో 1,623 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పరిధిలోని హాస్పిటల్స్‌లో 1616, ఆర్టీసీ ఆస్పత్రుల్లో 7 పోస్టులను భర్తీ చేయనున్నారు. సెప్టెంబర్ 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు దరఖాస్తుకు అవకాశం కల్పించారు. ఇక్కడ <