News August 22, 2025
VKB: భద్రత, బందోబస్తు కోసమే ఆన్లైన్: ఎస్పీ

వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ కోసం మండపాల నిర్వాహకులు పోలీసు శాఖ రూపొందించిన ఆన్లైన్ పోర్టల్లో వివరాలను నమోదు చేసుకోవాలని ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు. ఆన్లైన్ నమోదు భద్రత, బందోబస్తు ఏర్పాట్ల కోసం మాత్రమేనని, ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. ప్రతీ మండపం సమాచారం అందుబాటులో ఉంటే అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలకు అవకాశం ఉంటుందన్నారు.
Similar News
News August 22, 2025
కేసీఆర్‌కు స్వల్ప అనారోగ్యం?

TG: బీఆర్ఎస్ అధినేత KCR స్వల్ప అనారోగ్యానికి గురైనట్లు విశ్వసనీయ సమాచారం. హరీశ్‌రావుతో పాటు పలువురు ముఖ్య నేతలు ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌కు వెళ్లి ఆయన్ను పరామర్శించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆ అంశంపైనా వీరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. గత నెలలో కేసీఆర్ అనారోగ్యంతో యశోద ఆస్పత్రిలో కొన్నిరోజులు చికిత్స పొందిన విషయం తెలిసిందే.
News August 22, 2025
ముగిసిన నామినేషన్ల పరిశీలన.. బరిలో ఇద్దరే!

ఉపరాష్ట్రపతి ఎన్నికలో నామినేషన్ల పరిశీలన ముగిసింది. పలువురు దాఖలు చేసిన నామినేషన్లను స్క్రూటినీ చేశారు. అనంతరం ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఇద్దరే బరిలో నిలిచినట్లు అధికారులు ప్రకటించారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబర్ 9న జరగనుంది. ఎన్టీఏ కూటమికే అత్యధిక మంది ఎంపీలు ఉండటంతో రాధాకృష్ణన్ గెలుపు లాంఛనం కానుంది.
News August 22, 2025
కొత్తగూడెం: ‘ప్రభుత్వ కార్యాలయాల్లో ఆర్టీఐ బోర్డులు లేవు’

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో సమాచార హక్కు బోర్డులు లేవని RTI రాష్ట్ర నాయకులు మహమ్మద్ రియాజ్ అన్నారు. శుక్రవారం RTI రాష్ట్ర కార్యాలయంలో కమిషనర్ ను కలిసి ఫిర్యాదు చేశారు. సమాచార బోర్డుల్లో ప్రజా సమాచార అధికారి ఫోన్ నెంబర్లు లేకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, రెవెన్యూ, కార్పొరేషన్ కార్యాలయాల్లో ఆర్టీఐ బోర్డు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని తెలిపారు.