News August 22, 2025

ముగిసిన నామినేషన్ల పరిశీలన.. బరిలో ఇద్దరే!

image

ఉపరాష్ట్రపతి ఎన్నికలో నామినేషన్ల పరిశీలన ముగిసింది. పలువురు దాఖలు చేసిన నామినేషన్లను స్క్రూటినీ చేశారు. అనంతరం ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ఇద్దరే బరిలో నిలిచినట్లు అధికారులు ప్రకటించారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక సెప్టెంబర్ 9న జరగనుంది. ఎన్టీఏ కూటమికే అత్యధిక మంది ఎంపీలు ఉండటంతో రాధాకృష్ణన్ గెలుపు లాంఛనం కానుంది.

Similar News

News August 23, 2025

నేడు పెద్దాపురానికి సీఎం చంద్రబాబు

image

AP: సీఎం చంద్రబాబు ఇవాళ కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు పెద్దాపురంలో జరిగే స్వచ్ఛతా ర్యాలీలో సీఎం పాల్గొంటారు. మ్యాజిక్ డ్రైన్లు, స్వచ్ఛతా రథాలను పరిశీలించనున్నారు. ఆ తర్వాత స్థానిక పార్టీ నేతలతో సమావేశం నిర్వహిస్తారు. అనంతరం తిరిగి ఉండవల్లి చేరుకుని సా.5.30 గంటలకు మంత్రులు, ఎమ్మెల్యేలతో భేటీ అవుతారు.

News August 23, 2025

SA టీ20 లీగ్‌కు 13 మంది భారత ఆటగాళ్లు

image

వచ్చే నెల 9 నుంచి ప్రారంభం కానున్న SA టీ20 లీగ్‌లో 13 మంది భారత ఆటగాళ్లు బరిలోకి దిగే అవకాశం ఉంది. పీయూష్ చావ్లా, సిద్ధార్థ్ కౌల్, అంకిత్ రాజ్‌పుత్, వెంకటేశ్ గాలిపెల్లి, మహేశ్ అహిర్, సరుల్ కన్వర్, అనురీత్ సింగ్ కతూరియా, నిఖిల్ జగా, కేఎస్ నవీన్, ఇమ్రాన్ ఖాన్, అతుల్ యాదవ్, అన్సారీ మరూఫ్, మహమ్మద్ ఫైద్ వేలానికి తమ పేర్లు నమోదు చేసుకున్నారు. పీయూష్ తప్ప, మిగతా వారందరి బేస్ ప్రైజ్ రూ.10 లక్షలుగా ఉంది.

News August 23, 2025

జూబ్లీహిల్స్ బైపోల్‌లో కాంగ్రెస్‌దే గెలుపు: తుమ్మల

image

TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్‌దే గెలుపని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలను కలుపుకుని ముందుకు సాగాలని స్థానిక నేతలకు ఆయన సూచించారు. జూబ్లీహిల్స్ బూత్ లెవెల్ నేతలతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ‘ఈ ఎన్నికపై రాష్ట్రం మొత్తం దృష్టి సారించింది. ప్రతీ కార్యకర్త గెలుపే లక్ష్యంగా పనిచేయాలి. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పనులను ఇంటింటికీ వివరించాలి’ అని ఆయన పేర్కొన్నారు.