News April 2, 2024
మరోసారి తెరపైకి నాయకత్వ మార్పు!
కర్ణాటక కాంగ్రెస్ GOVTలో నాయకత్వ మార్పు అంశం మరోసారి తెరపైకొచ్చింది. ఎన్నికల ప్రచారంలో CM సిద్ధారామయ్య, డిప్యూటీ CM DK శివకుమార్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఊతమిస్తున్నాయి. ‘లోక్‌సభ ఎన్నికల్లో మా అభ్యర్థులు గెలిస్తే నన్ను ఎవరూ తాకలేరు. నేను సీఎంగా ఉండాలా?వద్దా?’ అని సిద్ధారామయ్య అన్నారు. ‘నన్ను దృష్టిలో ఉంచుకునే మీరు గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించారు. మీ కోరిక నెరవేరకపోదు’ అని DK అనడం గమనార్హం.
Similar News
News November 8, 2024
అఫ్గానిస్థాన్ స్టార్ ఆల్‌రౌండర్ నబీ రిటైర్మెంట్
అఫ్గానిస్థాన్ స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు తెలిపింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఆయనకు చివరి సిరీస్ అని ప్రకటించింది. కాగా 2009లో అఫ్గాన్ ఆడిన తొలి వన్డేలో నబీ సభ్యుడు. ఇప్పటివరకు ఆయన 165 వన్డేలు ఆడారు. 3,549 పరుగులతోపాటు 171 వికెట్లు కూడా పడగొట్టారు. 2019లోనే నబీ టెస్టుల నుంచి తప్పుకున్నారు. ఇకపై ఆయన టీ20ల్లోనే కొనసాగుతారు.
News November 8, 2024
నిస్సాన్‌లో 9,000 మందికి లేఆఫ్స్
జపాన్‌లో మూడో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ ‘నిస్సాన్’ భారీగా లేఆఫ్స్‌కు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా 9,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఇందులో యూరప్‌లోనే 4,700 జాబ్స్ ఉన్నట్లు వెల్లడించింది. అలాగే కార్ల ఉత్పత్తిని 20% తగ్గిస్తామని తెలిపింది. నిస్సాన్ వార్షికాదాయ అంచనాను 70 శాతం($975 మిలియన్) కుదించింది. తాము తీసుకునే చర్యలతో మళ్లీ పుంజుకుంటామని CEO మకోటో ఉచిద ధీమా వ్యక్తం చేశారు.
News November 8, 2024
స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోస్టుకార్డుల ఉద్యమం
AP: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోస్టుకార్డుల ఉద్యమానికి ఉత్తరాంధ్ర ప్రజా సంస్థ సిద్ధమైంది. ఈ నెల 10న విశాఖ ఆర్కే బీచ్ రోడ్ కాళీ మాత ఆలయం వద్ద ఈ ఉద్యమం ప్రారంభించనున్నారు. ప్రధాని మోదీకి దాదాపు 10 లక్షల పోస్టుకార్డులు పంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని ఈ కార్డుల ద్వారా ప్రధానిని కోరుతామని కన్వీనర్ రమణమూర్తి చెప్పారు.