News November 8, 2024
అఫ్గానిస్థాన్ స్టార్ ఆల్‌రౌండర్ నబీ రిటైర్మెంట్
అఫ్గానిస్థాన్ స్టార్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ వన్డే క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ఆ దేశ క్రికెట్ బోర్డు తెలిపింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఆయనకు చివరి సిరీస్ అని ప్రకటించింది. కాగా 2009లో అఫ్గాన్ ఆడిన తొలి వన్డేలో నబీ సభ్యుడు. ఇప్పటివరకు ఆయన 165 వన్డేలు ఆడారు. 3,549 పరుగులతోపాటు 171 వికెట్లు కూడా పడగొట్టారు. 2019లోనే నబీ టెస్టుల నుంచి తప్పుకున్నారు. ఇకపై ఆయన టీ20ల్లోనే కొనసాగుతారు.
Similar News
News December 9, 2024
అల్లు అర్జున్.. మేమంతా మీ అభిమానులం: బిగ్ బి
తనకు బిగ్ బి అంటే ఎంతో అభిమానమని, ఇప్పటికీ ఆయనే తనకు స్ఫూర్తినిస్తుంటారని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. దీనిపై అమితాబ్ స్పందించారు. ‘అల్లుఅర్జున్.. మీ మాటలకు చాలా కృతజ్ఞుడ్ని. నా అర్హత కంటే ఎక్కువ చెప్పారు. మీ పని & ప్రతిభకు మేమంతా పెద్ద అభిమానులం. మీరు మా అందరికీ స్ఫూర్తినిస్తూ ఉండండి. మీకు మరిన్ని సక్సెస్‌లు రావాలని ప్రార్థిస్తున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు.
News December 9, 2024
ట్రాఫిక్ సిగ్నల్స్ అందుబాటులోకి వచ్చింది ఈరోజే!
ట్రాఫిక్ రూల్స్‌లో ఎంతో ముఖ్యమైన సిగ్నల్ లైట్స్ మొట్ట మొదటిసారిగా అందుబాటులోకి వచ్చింది ఈరోజే. డిసెంబర్ 9, 1868న ప్రపంచంలో తొలిసారిగా లండన్‌లో ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ ఏర్పాటు చేశారు. రాత్రిపూట ఉపయోగించే ఎరుపు, ఆకుపచ్చ గ్యాస్ ల్యాంప్స్ ద్వారా వీటిని ఏర్పాటు చేశారు. అయితే, దురదృష్టవశాత్తు నెలరోజుల్లోనే పేలుడు సంభవించడంతో ఈ ప్రయోగానికి ముగింపు పలికారు.
News December 9, 2024
జెత్వానీ కేసు.. విద్యాసాగర్‌కు బెయిల్
AP: సినీ నటి జెత్వానీ కేసులో వ్యాపారవేత్త కుక్కల విద్యాసాగర్‌కు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నటిని వేధించారనే ఆరోపణలపై ఆయనను పోలీసులు సెప్టెంబర్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. విద్యాసాగర్‌కు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేయొచ్చని నటి తరఫు లాయర్లు వాదించగా కోర్టు తోసిపుచ్చింది.