News August 23, 2025

ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్ అవుతారు.. చర్యలుండవా: బొత్స

image

APలో TDP నేతల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని YCP నేత బొత్స సత్యనారాయణ ఆరోపించారు. మంత్రులు, MLAలపై అవినీతి ఆరోపణలు ఎక్కువయ్యాయని విమర్శించారు. MLAల తీరుపై CM సీరియస్ అవుతారు కానీ చర్యలు తీసుకోరా? అని ప్రశ్నించారు. పెన్షన్ల కోసం దివ్యాంగులు ధర్నా చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోదా అని ఫైరయ్యారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో 32 విభాగాలు ప్రైవేటీకరణ చేశారని, దీనిపై పవన్ తన వైఖరి చెప్పాలని డిమాండ్ చేశారు.

Similar News

News March 6, 2026

BREAKING: ఫైనల్లోకి భారత్

image

T20WCలో భారత్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఉత్కంఠభరితంగా జరిగిన సెమీఫైనల్లో ఇంగ్లండ్‌పై 7 రన్స్ తేడాతో విజయం సాధించింది. 254 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లిష్ బ్యాటర్లు దూకుడుగా ఆడారు. బెథెల్ సెంచరీతో (48 బంతుల్లో 105) బెంబేలెత్తించినా చివర్లో వికెట్లు పడటంతో భారత్ విజయం సాధించింది. ఆదివారం అహ్మదాబాద్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య ఫైనల్ జరగనుంది.

News March 6, 2026

బుమ్రా@500 వికెట్లు

image

టీమ్ ఇండియా స్టార్ బౌలర్ బుమ్రా అరుదైన ఘనత సాధించారు. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి 500 వికెట్లు తీశారు. ఇవాళ సెమీఫైనల్లో ENG కెప్టెన్ బ్రూక్‌ను ఔట్ చేసి ఈ క్లబ్బులో చేరారు. 2016లో అరంగేట్రం చేసిన బుమ్రా 235 మ్యాచులు ఆడారు. 18 సార్లు 5 వికెట్లు తీశారు. భారత్ తరఫున అత్యధిక వికెట్ల రికార్డు అనిల్ కుంబ్లే పేరిట ఉంది. ఆ లెజెండరీ బౌలర్ 401 మ్యాచుల్లో 953 వికెట్లు పడగొట్టారు.

News March 6, 2026

విజయ్-రష్మిక పెళ్లి ఖర్చు ఎంతంటే?

image

విజయ్ దేవరకొండ-రష్మిక తమ పెళ్లి కోసం భారీగా ఖర్చు చేసినట్లు సమాచారం. ఉదయ్‌పూర్‌లోని ప్యాలెస్‌లో 4 రోజుల వేడుకల నుంచి హైదరాబాద్‌లో రిసెప్షన్‌కు వరకు రూ.15-20 కోట్లు వెచ్చించినట్లు వార్తలు వస్తున్నాయి. పెళ్లి కోసం 3 కేజీల బంగారు ఆభరణాలు కొనుగోలు చేసినట్లు టాక్. వివాహ బాధ్యతను ఓ ప్రైవేట్ ఈవెంట్ సంస్థ చూసుకోగా, వీరి పెళ్లి వీడియోను నెట్‌ఫ్లిక్స్ రూ.60 కోట్లకు సొంతం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.