News April 2, 2024
IPL: ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ ఎవరివంటే..

ఐపీఎల్‌లో 14 మ్యాచులు పూర్తయ్యాయి. 3 మ్యాచుల్లో 181 పరుగులతో RCB బ్యాటర్ కోహ్లీ, RR ప్లేయర్ పరాగ్ సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. హైదరాబాద్ స్టార్ హెన్రిచ్ క్లాసెన్ 167 పరుగులతో ఆరెంజ్ క్యాప్ వేటలో ఉన్నారు. ఇక బౌలర్లలో సీఎస్కే బౌలర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ 7 వికెట్లతో టాప్‌లో ఉండగా.. ఆర్ఆర్ స్పిన్నర్ చాహల్ 6 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నారు.
Similar News
News March 20, 2026
IPL: ఇంజ్యూర్డ్ ప్రీమియర్ లీగ్.. నెట్టింట ట్రోల్స్

IPL కీలక ప్లేయర్లు గాయాలబారిన పడి లీగ్‌కు దూరం అవుతున్నారు. దీంతో IPLను ఇంజ్యూర్డ్ ప్రీమియర్ లీగ్ అంటూ నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. ఎల్లిస్(CSK), సామ్ కరన్(RR), హర్షిత్(KKR), మిల్నే(RR), జాక్ ఎడ్వర్డ్స్(SRH), హసరంగా(LSG) ఇప్పటికే లీగ్ నుంచి వైదొలిగారు. ఇక హేజిల్ వుడ్(RCB), కమిన్స్(SRH) గాయాలతో కొన్ని మ్యాచులకు దూరం కానున్నారు. ఈనెల 28న లీగ్ ప్రారంభమయ్యేలోపు ఇంకెంత మంది ఇలా గాయాలబారిన పడతారో?
News March 20, 2026
చలాన్ కట్టకపోతే లైసెన్స్, RC ఫ్రీజ్!

TG: సకాలంలో చలాన్లు చెల్లించకపోతే డ్రైవింగ్ లైసెన్స్, RC ఫ్రీజ్ చేసే దిశగా ప్రభుత్వం కొత్త రూల్ తెస్తోంది. ఏడాదికి 5 కంటే ఎక్కువ చలాన్లు ఉండి, అవి చెల్లించకపోతే చర్యలు చేపడతారు. ఇందుకు సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ రానుంది. కేంద్ర మోటార్ వాహన నిబంధనల ప్రకారం చలాన్లపై అభ్యంతరాలను వేగంగా పరిష్కరించేందుకు గ్రీవెన్స్ రెడ్రెసల్ అథారిటీని ఏర్పాటు చేయనుంది. వాహనదారులు ఇందులో ఫిర్యాదు చేయవచ్చు.
News March 20, 2026
అజహరుద్దీన్ మంత్రి పదవికి డెడ్‌లైన్ గండం!

TG: మంత్రిగా కొనసాగుతున్న అజహరుద్దీన్‌కు ఏప్రిల్ ఆఖరుతో 6 నెలల గడువు ముగియనుంది. ప్రభుత్వం పంపిన MLC సిఫార్సును గవర్నర్ ఇంకా ఆమోదించకపోవడంతో ఆయన పదవిపై సందిగ్ధం నెలకొంది. నిబంధనల ప్రకారం ఆలోగా సభ్యత్వం పొందకుంటే రాజీనామా తప్పదు. మరోవైపు గవర్నర్ నిర్ణయంపై సుప్రీంకోర్టు స్పందిస్తూ హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించడంతో ఇప్పుడు అందరి దృష్టి న్యాయస్థానంపైనే ఉంది. ఈ ఉత్కంఠకు తెరపడేది ఎప్పుడో చూడాలి.


