News April 2, 2024

OTTలోకి వచ్చేస్తున్న కొత్త సినిమా?

image

‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ నటించిన ఇంట్రెస్టింగ్ అడ్వెంచర్ సినిమా ‘గామి’ OTT స్ట్రీమింగ్ తేదీ ఖరారైనట్లు తెలుస్తోంది. తాజా అప్‌డేట్ ప్రకారం ఏప్రిల్ 12న జీ 5 OTTలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. మార్చి 8న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. కాగిత విద్యాధర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అభినయ, సమద్ తదితరులు నటించారు.

Similar News

News March 18, 2026

రేపే ఉగాది.. ఇలా చేస్తే మంచిది!

image

తెలుగు క్యాలెండర్ ప్రకారం ‘శ్రీ పరాభవ నామ’ సంవత్సరం రేపు ప్రారంభంకానుంది. ఇది గతాన్ని విశ్లేషించుకొని కొత్త విజయాల వైపు సాగాలని సూచిస్తుంది. సూర్యోదయానికి ముందే స్నానాలు ఆచరించి, ఇళ్లను మామిడి తోరణాలతో అలంకరించుకోవాలి. పంచాంగ శ్రవణం వినడం వల్ల నూతన సంవత్సర రాశిఫలాలు, గ్రహాల ప్రభావం తెలుస్తుంది. గుమ్మాలకు పసుపు, కుంకుమ రాసి ముగ్గులు వేయాలి. ఇష్ట దైవానికి పూజ చేసి దానం చేయడం శుభప్రదం. SHARE IT

News March 18, 2026

మరో 10 రోజుల్లో సందడే సందడి!

image

క్రికెట్ అభిమానుల నిరీక్షణకు మరో 10 రోజుల్లో తెరపడనుంది. ఈ నెల 28న IPL సీజన్-19 అట్టహాసంగా <<19356627>>ప్రారంభం<<>> కానుంది. 10 జట్లు టైటిల్ వేటలో పోటీ పడనున్నాయి. సమ్మర్‌లో సుమారు 2 నెలల పాటు ఫ్యాన్స్‌కు వినోదం పంచనున్నాయి. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ RCB, SRH తలపడనున్నాయి. మరి మీ ఫేవరెట్ టీమ్ ఏది? టైటిల్ ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

News March 18, 2026

ధురంధర్-2: ఇంకా థియేటర్లకు చేరని సెకండాఫ్?

image

భారీ అంచనాల మధ్య రేపు విడుదలవుతున్న ‘ధురంధర్: ది రివెంజ్’ సినిమా షోలపై అనుమానాలు నెలకొన్నాయి. సినిమాకు సంబంధించి కేవలం ఫస్టాఫ్ మాత్రమే థియేటర్లకు చేరినట్లు సమాచారం. క్లైమాక్స్, సెకండాఫ్‌లో కొన్ని మార్పులు చేస్తుండటంతో పూర్తి సినిమా అందడంలో ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది. ఆన్‌లైన్ ద్వారా కంటెంట్ పొందే థియేటర్లు మేనేజ్ చేసినా హార్డ్ డ్రైవ్‌లపై ఆధారపడే సింగిల్ స్క్రీన్లకు కష్టాలు తప్పవు.