News April 3, 2024
ఉమ్మడి చిత్తూరులో నేడు సీఎం జగన్ బస్సు యాత్ర
AP: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 7వ రోజు సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర కొనసాగనుంది. ఉదయం 9గంటలకు అమ్మగారిపల్లె నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. తేనెపల్లి, రంగంపేట క్రాస్ మీదుగా మధ్యాహ్నానికి జగన్ పూతలపట్టు చేరుకుంటారు. మ.3గంటలకు పూతలపట్టులో బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అనంతరం పి.కొత్తకోట, పాకాల, గదంకి, పనపాకం, చంద్రగిరి, రేణిగుంట మీదుగా గురువరాజుపల్లె చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు.
Similar News
News January 6, 2025
BGT ఓటమిపై జైస్వాల్ పోస్ట్
ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఎంతో నేర్చుకున్నట్లు టీమ్ఇండియా ప్లేయర్ యశస్వీ జైస్వాల్ ట్వీట్ చేశారు. ‘దురదృష్టవశాత్తూ ఫలితం మేము ఆశించినట్లు రాలేదు. కానీ మేము మరింత బలంగా మారాం. భారత జట్టుకు మీరు చేసిన సపోర్ట్ మేము మర్చిపోలేము’ అని ఆయన పోస్ట్ చేశారు. దీనికి ఆస్ట్రేలియా క్రికెటర్ ఉస్మాన్ ఖవాజా స్పందిస్తూ ‘మీ ఆట నాకు నచ్చింది’ అని కామెంట్ చేశారు. BGTలో జైస్వాల్ ఆటపై మీ కామెంట్?
News January 6, 2025
పేర్ని నాని ముందస్తు బెయిల్‌పై విచారణ వాయిదా
AP: వైసీపీ నేత పేర్ని నాని ముందుస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. అప్పటివరకు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాగా సివిల్ సప్లైస్‌కు సంబంధించిన కేసులో పేర్నిని ఏ6గా మచిలీపట్నం పోలీసులు చేర్చారు. ఈ కేసుకు సంబంధించి ఆయన ముందస్తు బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు.
News January 6, 2025
ప్రశాంత్ కిశోర్‌కు 14 రోజుల రిమాండ్
JSP అధ్యక్షుడు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌కు పట్నా సివిల్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఎయిమ్స్‌లో వైద్య పరీక్షల అనంతరం ఆయనను జైలుకు తరలిస్తారు. కాగా BPSC పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పట్నాలోని గాంధీ మైదాన్‌లో ప్రశాంత్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేసి ఆయనను కోర్టులో హాజరుపర్చారు. అక్కడ బాండ్ పేపర్‌పై సంతకం చేయడానికి నిరాకరించడంతో కోర్టు రిమాండ్ విధించింది.