News April 3, 2024
పవన్‌కు తీవ్ర జ్వరం.. పర్యటనలు రద్దు

AP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. నిన్న స్వల్పంగా ఉన్న జ్వరం ఇప్పుడు తీవ్రమైనట్లు జనసేన పార్టీ ప్రకటించింది. దీంతో ఇవాళ్టి తెనాలి, రేపటి నెల్లిమర్ల పర్యటనలను రద్దు చేసుకున్నట్లు పార్టీ వెల్లడించింది. జ్వరంతో హైదరాబాద్‌కు వెళ్లిన జనసేనానికి కనీసం 2-3 రోజుల విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపినట్లు ట్వీట్ చేసింది. పర్యటన రీ షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది.
Similar News
News March 11, 2026
LPG (లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్) ఎలా తయారు చేస్తారు?

LPG ప్రొపేన్, బ్యూటేన్ వాయువుల మిశ్రమం. దీనిని 2 విధాలుగా (నేచురల్ గ్యాస్ ప్రాసెసింగ్, క్రూడ్ ఆయిల్ రిఫైనింగ్) తయారు చేస్తారు. ముందుగా సహజ వాయువు/ముడి చమురు నుంచి ప్రొపేన్, బ్యూటేన్‌ను వేరు చేస్తారు. వీటిలోని నీరు, హైడ్రోజన్ సల్ఫైడ్, CO2 తొలగిస్తారు. తర్వాత ద్రవ రూపంలోకి మార్చి లీకేజీని గుర్తించేలా వాసన గల రసాయనాన్ని(ఈథైల్ మెర్కాప్టన్) కలుపుతారు. తర్వాత బాట్లింగ్ ప్లాంట్లలో సిలిండర్లలో నింపుతారు.
News March 11, 2026
ఐపీఎల్-26కు రూ.18కోట్ల ప్లేయర్ దూరం?

IPL మినీ వేలంలో రెండో అత్యధిక ధర(₹18Cr) పలికిన శ్రీలంక పేసర్ పతిరణ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదని తెలుస్తోంది. ఈనెల 28 నుంచి టోర్నీ ప్రారంభం కానుండగా ఆయన ఇంకా KKR జట్టులో చేరలేదని Cricbuzz పేర్కొంది. SL క్రికెట్ బోర్డు సెంటర్‌లో కోలుకుంటున్నట్లు తెలిపింది. పతిరణ ఎడమ కాలు కండరాల నొప్పితో టీ20 WC నుంచి మధ్యలోనే వైదొలిగిన సంగతి తెలిసిందే. IPLలో ఆయన CSK తరఫున 32 మ్యాచుల్లో 47 వికెట్లు తీశారు.
News March 11, 2026
‘RC17’పై బిగ్ అప్‌డేట్ ఎప్పుడు?

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించబోయే సినిమా గురించి బిగ్ అప్‌డేట్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ నెల 27న చరణ్ బర్త్‌డే సందర్భంగా ఏదైనా పెద్ద ప్రకటన ఉండొచ్చని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సుకుమార్ స్టోరీని రెండు వెర్షన్‌లుగా సిద్ధం చేశారని, చరణ్‌తో చర్చించి ఒక దానిని ఫైనల్ చేయాల్సి ఉందని టాక్ వినిపిస్తోంది. కాగా ప్రస్తుతం RC నటిస్తున్న ‘పెద్ది’ మూవీ APR 30న రిలీజ్ కానుంది.


