News April 3, 2024

పవన్‌కు తీవ్ర జ్వరం.. పర్యటనలు రద్దు

image

AP: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. నిన్న స్వల్పంగా ఉన్న జ్వరం ఇప్పుడు తీవ్రమైనట్లు జనసేన పార్టీ ప్రకటించింది. దీంతో ఇవాళ్టి తెనాలి, రేపటి నెల్లిమర్ల పర్యటనలను రద్దు చేసుకున్నట్లు పార్టీ వెల్లడించింది. జ్వరంతో హైదరాబాద్‌కు వెళ్లిన జనసేనానికి కనీసం 2-3 రోజుల విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపినట్లు ట్వీట్ చేసింది. పర్యటన రీ షెడ్యూల్‌ను త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది.

Similar News

News April 20, 2025

కాబోయే భర్తకు ఉండాల్సిన 18 లక్షణాలు.. యువతి పోస్ట్ వైరల్

image

తనకు కాబోయే భర్తకు 18 లక్షణాలు ఉండాలంటూ డేటింగ్ యాప్‌లో ఓ యువతి పోస్ట్ చేసింది. ‘నాపై డీప్ లవ్, రూ.2.5 కోట్ల జీతం, లగ్జరీ లైఫ్, ఉదార స్వభావం, తెలివైన, ధైర్యం, విలువలు, ఫిట్‌నెస్, క్రమశిక్షణ, సామాజిక గౌరవం, ఫ్యామిలీ పర్సన్, నా లైఫ్‌స్టైల్‌కు సపోర్ట్, ట్రావెలింగ్, ప్రైవసీకి ప్రాధాన్యం, లైంగిక క్రమశిక్షణ, గర్భనిరోధక చర్యలు, ఈజీ లైఫ్ లీడ్ చేయించే వాడు’ తనకు భర్తగా కావాలని రాసుకొచ్చింది. మీ COMMENT?

News April 20, 2025

మరణంపై విజయం.. ఈస్టర్ శుభాకాంక్షలు

image

శిలువపై ప్రాణాలు విడిచిన ఏసు.. ఈస్టర్ రోజు తిరిగి ప్రాణం పోసుకుని ప్రజల మధ్యకు వచ్చారు. మరణంపై ఏసు సాధించిన విజయానికి గుర్తుగా ఈస్టర్‌ను పండుగగా జరుపుకుంటారు. క్రైస్తవులు పాటించే లెంట్ సీజన్ కూడా ఈ రోజుతో ముగుస్తుంది. మరణం అనేది జీవితానికి అంతం కాదని.. ఏసు తన జీవితం ద్వారా సందేశమిచ్చారు. ఈస్టర్‌ను కొత్త జీవితం, ఆశ, విశ్వాసానికి చిహ్నంగా భావిస్తారు.

News April 20, 2025

VIRAL: ఈ 500 తీసుకుని పాస్ చేయండి..!

image

కర్ణాటక చిక్కోడిలో పదో తరగతి జవాబు పత్రాల్లో సమాధానాలకు బదులు కరెన్సీ నోట్లు, కాళ్ల బేరాలు దర్శనమిచ్చాయి. తమను ఎలాగైనా పాస్ చేయాలంటూ కొందరు రూ.500 నోట్లు పెట్టారు. పాస్ చేస్తే ఇంకా డబ్బిస్తామని ఆశ చూపించారు. ఇంకొందరైతే ‘నా ప్రేమ మీరు వేసే మార్కుల మీదే ఆధారపడి ఉంది’ అని రాశారు. మరికొంత మంది ‘మీరు పాస్ చేయకపోతే కాలేజీకి వెళ్లలేను.. ప్లీజ్ పాస్ చేయండి’ అని వేడుకున్నారు.

error: Content is protected !!