News April 3, 2024

HYD: అద్దె కార్లు అమ్ముతున్న ముఠా అరెస్ట్

image

లాంగ్ డ్రైవ్‌లో అద్దెకు కార్లు తీసుకొని వాటిని అమ్ముతున్న ముఠాను HYD మాదాపూర్ పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. మాదాపూర్ ఏసీపీ మాట్లాడుతూ.. ఆదిలాబాద్‌లో ఉంటున్న హరీశ్ కుందారపు అనే వ్యక్తికి, సదరు వ్యక్తులు కార్లు ఇవ్వడంతో వీరికి కొంత కమిషన్ రూపంలో హరీశ్ అనే వ్యక్తి ఇస్తున్నట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి రూ.కోటి విలువ చేసే 6 కార్లును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Similar News

News January 4, 2026

సైబరాబాద్ పోలీస్ అధికారుల ఫోన్ నంబర్ల మార్పు

image

సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీస్ అధికారుల అధికారిక ఫోన్ నంబర్లు 87126 సిరీస్‌కు మారాయి. పాత నంబర్లు ఇకపై పనిచేయవు. నేటి నుంచి కొత్త నంబర్లలో అధికారులు అందుబాటులో ఉంటారని పోలీసులు తెలిపారు. సీపీ డా.ఎం.రమేశ్- 87126630001, జాయింట్ సీపీ- 8712663002, సీపీ CP- 8712663006, డీసీపీలు ఎస్‌బీ- 3003, మాదాపూర్- 3004, బాలానగర్- 3005, డబ్ల్యూ & సీఎస్‌డబ్ల్యూ- 3008, క్రైమ్- 3009లలో ఇక నుంచి సంప్రదించాలి.

News January 4, 2026

HYD: లవర్ మోజులో.. భర్తను చంపేసింది

image

మహిళ, ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన నగరంలో కలకలం రేపింది. పోలీసుల ప్రకారం.. ఒడిశాకు చెందిన ప్లంబర్ నారాయణ (35) భార్య బంధిత (27), కుమార్తె (6)తో మల్లాపూర్‌లో నివాసం ఉంటున్నాడు. విద్యాసాగర్ అనే వ్యక్తితో వివాహేతర బంధం పెట్టుకున్న ఆమె, అడ్డొస్తున్నాడని లవర్‌తో కలిసి రాడ్డుతో కొట్టి చంపింది. కేసు నమోదు చేసిన పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. పోలీసుల విచారణలో భార్య నేరాన్ని అంగీకరించింది.

News January 4, 2026

HYD: నిరుద్యోగులకు ఫ్రీ ట్రైనింగ్ + జాబ్

image

నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు మంత్రి కొమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ (NAC), EGMM సంయుక్తంగా శిక్షణను నిర్వహిస్తున్నాయి. 18-35 ఏళ్ల గ్రామీణ యువత అర్హులు. 3 నెలల శిక్షణలో భోజనం, వసతి, యూనిఫాం, హెల్మెట్ ఉచితంగా ఇస్తారు. శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. దరఖాస్తు చివరి తేదీ JAN15. nac.edu.in వెబ్‌సైట్ చూడండి.