News January 4, 2026
HYD: లవర్ మోజులో.. భర్తను చంపేసింది

మహిళ, ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన ఘటన నగరంలో కలకలం రేపింది. పోలీసుల ప్రకారం.. ఒడిశాకు చెందిన ప్లంబర్ నారాయణ (35) భార్య బంధిత (27), కుమార్తె (6)తో మల్లాపూర్‌లో నివాసం ఉంటున్నాడు. విద్యాసాగర్ అనే వ్యక్తితో వివాహేతర బంధం పెట్టుకున్న ఆమె, అడ్డొస్తున్నాడని లవర్‌తో కలిసి రాడ్డుతో కొట్టి చంపింది. కేసు నమోదు చేసిన పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. పోలీసుల విచారణలో భార్య నేరాన్ని అంగీకరించింది.
Similar News
News April 20, 2026
కొడంగల్: CM ఇలాకాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రూ.224 కోట్లతో 450 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. కాగా, రాష్ట్రంలోని పెద్ద సర్కార్ దవాఖానాలైన గాంధీ (2,000+ పడకలు), ఉస్మానియా (1,168+ పడకలు) తర్వాత, ప్రాంతీయ స్థాయిలో ఇంతటి ఆధునిక వైద్యశాల రావడం ఇదే తొలిసారి. ఈ భారీ నిర్మాణం పూర్తయితే కొడంగల్‌తో పాటు పరిసర జిల్లాలకు ఎంతో ఉపయోగపడనుంది.

HYDలో త్వరలో మరో IVF సెంటర్

HYD హైకోర్టు సమీపంలోని పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో త్వరలో IVF కేంద్రం అందుబాటులోకి రానుంది. గాంధీ ఆసుపత్రిలో IVF సెంటర్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఇక్కడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు DME నరేందర్ కుమార్ తెలిపారు. సుమారుగా 490 పడకల సామర్థ్యంతో, డాక్టర్లతో అద్భుతమైన సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రెగ్నెన్సీ పరీక్షలు చేయడం, పసిపిల్లలకు వైద్యం, పిల్లల తల్లులకు అడ్వాన్స్‌డ్ వైద్యం అందించనున్నారు.