News September 9, 2025
దేశంలో అత్యధిక మరణాలు ఈ వ్యాధితోనే!

మన దేశంలో (2021-2023) అత్యధిక మంది గుండె జబ్బుల (31%) వల్లే మరణిస్తున్నట్లు రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా సర్వే తెలిపింది. ఆ తర్వాత 9.3% మంది శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, 6.4% మంది కణజాల సమస్యలు, 5.7% మంది శ్వాసకోశ వ్యాధులు, 4.9% మంది జ్వరాలు, 3.7% మంది గాయాలు, 3.5% మంది షుగర్ వ్యాధితో చనిపోతున్నట్లు వివరించింది. 15-29 ఏళ్ల మధ్యవారు ఎక్కువగా ఆత్మహత్యలు, రోడ్డు ప్రమాదాల కారణంగా మరణిస్తున్నట్లు తెలిపింది.
Similar News
News September 10, 2025
నేపాల్‌లో శాంతికి పిలుపునిచ్చిన మోదీ

నేపాల్‌లో యువత ఆందోళనలతో నెలకొన్న హింసాత్మక పరిస్థితులపై ప్రధాని మోదీ X వేదికగా స్పందించారు. ‘నేపాల్‌లో చోటుచేసుకున్న హింస హృదయవిదారకం. ఎంతో మంది యువకులు ప్రాణాలు కోల్పోయారు. అక్కడి పరిస్థితులపై సెక్యూరిటీ క్యాబినెట్ కమిటీ చర్చించింది. నేపాల్‌లో స్థిరత్వం, శాంతి, శ్రేయస్సు మాకు చాలా ముఖ్యం. శాంతికి మద్దతివ్వాలని నేపాలీ సోదర, సోదరీమణులకు విజ్ఞప్తి చేస్తున్నా’ అని ఆయన పిలుపునిచ్చారు.
News September 10, 2025
ఉదయం అలారం పెట్టుకుని లేస్తున్నారా?

ఉరుకుల పరుగుల జీవితంలో ఉదయాన్నే సమయానికి నిద్ర లేవాలంటే అలారం తప్పనిసరిగా మారిపోయింది. అయితే అలారం శబ్దంతో హార్ట్ అటాక్, స్ట్రోక్ ముప్పు పెరుగుతుందని తాజా అధ్యయనం తెలిపింది. యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియాస్ స్కూల్ ఆఫ్ నర్సింగ్‌లో రీసెర్చర్ కిమ్ చేసిన ప్రయోగంలో ఈ విషయాన్ని గుర్తించారు. సాధారణంగా మేల్కొనే వారికంటే అలారం వాడే వారిలో BP పెరుగుదల 74% అధికంగా ఉందని, స్ట్రోక్ రిస్క్ ఎక్కువని వెల్లడించారు.
News September 9, 2025
ఆర్మీ చేతుల్లోకి పాలన.. నేపాల్‌లో హై అలర్ట్

నేపాల్‌లో యువత ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ఆ దేశ ఆర్మీ రంగంలోకి దిగింది. ఇవాళ రాత్రి గం.10PM నుంచి లా&ఆర్డర్‌ను చేతుల్లోకి తీసుకున్నట్లు అధికారిక ప్రకటన విడుదల చేసింది. దేశంలో హై అలర్ట్ విధించింది. ఆందోళనలను ఆసరాగా చేసుకుని కొన్ని ముఠాలు ప్రజా ఆస్తులు ధ్వంసం చేస్తూ నేరాలకు పాల్పడుతున్నాయంది. అలాంటి చర్యలకు దూరంగా ఉండాలని హెచ్చరించింది. పరిస్థితులపై సమీక్షించి అప్డేట్స్ ఇస్తామని వెల్లడించింది.