News September 9, 2025

పశువులు, గొర్రెల, మేకల ఎరువుతో లాభాలు

image

ఒక టన్ను పశువుల ఎరువును ఎకరం పొలంలో వేస్తే 5-15KGల నత్రజని, 4-8KGల భాస్వరం, 5-19KGల పొటాష్, ఇతర పోషకాలు పంటకు అందుతాయి. ఒక టన్ను గొర్రెల, మేకల ఎరువు వేస్తే 5-7KGల నత్రజని, 4-6KGల భాస్వరం, 8-10KGల పొటాష్, ఇతర పోషకాలు మొక్కలకు చేరతాయి. ఫలితంగా భూమిలో సేంద్రియ పదార్థం పెరగడంతో పాటు భూమి గుల్లబారి పంటకు పోషకాలు తొందరగా అందుతాయి. గొర్రెల మందలను ఖాళీ పొలంలో కడితే వాటి మలమూత్రాలతో భూసారం పెరుగుతుంది.

Similar News

News September 10, 2025

నేడు రక్షణ శాఖ మంత్రితో సీఎం రేవంత్ భేటీ

image

TG: ఢిల్లీ పర్యటనలో ఉన్న CM రేవంత్ ఇవాళ కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో భేటీ కానున్నారు. రాష్ట్రంలోని రక్షణ శాఖ భూముల బదలాయింపుపై విజ్ఞప్తులు చేయనున్నారు. కరీంనగర్, రామగుండం కనెక్టివిటీ కోసం, HYDలో రోడ్లు, ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం డిఫెన్స్ మినిస్ట్రీ భూములను ఇవ్వాలని కోరనున్నట్లు సమాచారం. వీటితో పాటు సైనిక్ స్కూల్ ఏర్పాటుపైనా చర్చించనున్నారు. అనంతరం HYDకు తిరిగి వస్తారు.

News September 10, 2025

ఆసియా కప్: నేడు IND vs UAE

image

ఆసియా కప్‌లో ఇవాళ గ్రూప్-A నుంచి భారత్, UAE తలపడనున్నాయి. దుబాయ్ స్టేడియంలో రా.8 గంటలకు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 2016 ఆసియా కప్ తర్వాత ఈ రెండు జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి. ఈ మ్యాచులో విజయావకాశాలు టీమ్ ఇండియాకే ఎక్కువగా ఉన్నప్పటికీ UAEని తక్కువ అంచనా వేయొద్దని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. గత 7 నెలలుగా భారత్ T20లు ఆడలేదని, అటు UAEకి ఇది హోమ్ గ్రౌండ్ అని గుర్తుచేస్తున్నారు.

News September 10, 2025

నేడే ‘సూపర్ సిక్స్ – సూపర్ హిట్’

image

AP: సూపర్ సిక్స్ హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంలోని TDP, JSP, BJP తొలిసారి భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాయి. ఇవాళ అనంతపురంలో ‘సూపర్ సిక్స్-సూపర్ హిట్’ పేరిట కార్యక్రమం జరగనుంది. CM చంద్రబాబు, Dy.CM పవన్, BJP రాష్ట్రాధ్యక్షుడు మాధవ్ సహా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. 15 నెలల్లో రాష్ట్రంలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నారు.