News September 9, 2025
రాష్ట్రమంతా అరకు కాఫీ దుకాణాలే: మంత్రి సంధ్యారాణి

రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో అరకు కాఫీ షాప్‌లు పెట్టాలని, ఉత్పత్తులను అందుబాటులో ఉంచాలని జీసీసీ అధికారులను మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఆదేశించారు. అరకు కాఫీ బ్రాండ్ ఇమేజ్‌ను ప్రపంప వ్యాప్తి చేయటంలో ప్రణాళికాయుత చర్యలు చేపట్టాలన్నారు. ఉత్పత్తుల నిర్వహణ బేరిబోర పురుగు వ్యాప్తిపై తీసుకోవాల్సిన చర్యలు, అంశాలపై జీసీసీ ఛైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ చర్చించారు.
Similar News
News September 10, 2025
ఆసియా కప్: నేడు IND vs UAE

ఆసియా కప్‌లో ఇవాళ గ్రూప్-A నుంచి భారత్, UAE తలపడనున్నాయి. దుబాయ్ స్టేడియంలో రా.8 గంటలకు మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. 2016 ఆసియా కప్ తర్వాత ఈ రెండు జట్ల మధ్య టీ20 మ్యాచ్ జరగడం ఇదే తొలిసారి. ఈ మ్యాచులో విజయావకాశాలు టీమ్ ఇండియాకే ఎక్కువగా ఉన్నప్పటికీ UAEని తక్కువ అంచనా వేయొద్దని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. గత 7 నెలలుగా భారత్ T20లు ఆడలేదని, అటు UAEకి ఇది హోమ్ గ్రౌండ్ అని గుర్తుచేస్తున్నారు.
News September 10, 2025
నేడు అద్దంకికి రానున్న APS-RTC MD

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ వైస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకాతిరుమలరావు బుధవారం అద్దంకి ఆర్టీసీ డిపోను సందర్శించనున్నారు. ఈ విషయాన్ని అద్దంకి RTC డిపో మేనేజర్ బెల్లం రామ మోహన్‌రావు మంగళవారం తెలిపారు. RTC గ్యారేజీ, డిపో, బస్టాండ్ పరిసరాలను పరిశీలిస్తారన్నారు. ఆర్టీసీ అధికారులు అందుబాటులో ఉండాలని DM కోరారు.
News September 10, 2025
ఖమ్మం: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతులకు భవన నిర్మాణ కార్మిక(మేస్త్రి) పని, నర్సరీ మేనేజ్మెంట్, మొబైల్ రిపేరింగ్‌పై ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. 30 రోజుల శిక్షణతో పాటు భోజన, వసతి సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు. ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని తమ కార్యాలయంలో ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.