News September 10, 2025

దసరా సెలవుల్లో మార్పులు చేయాలని విజ్ఞప్తి

image

AP: దసరా సెలవుల్లో మార్పులు చేయాలని ప్రభుత్వానికి MLC గోపిమూర్తి విజ్ఞప్తి చేశారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం స్కూళ్లకు ఈ నెల 24 నుంచి అక్టోబర్ 2 వరకు సెలవులు ఉన్నాయి. అయితే పండుగ ఈ నెల 22 నుంచే మొదలవుతుందని, ఈ నేపథ్యంలో ఆ తేదీ నుంచే సెలవులు ఇవ్వాలని కోరారు. DSC నియామకాలకు ముందే అంతర్ జిల్లా బదిలీలు చేపట్టాలని, పెండింగ్‌లో ఉన్న స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్లను పూర్తి చేయాలన్నారు.

Similar News

News February 12, 2026

‘వందేమాతరం’ ఆలాపన ఉత్తర్వులపై ముస్లిం బోర్డు అభ్యంతరం

image

అన్ని స్కూళ్లు, అధికారిక కార్యక్రమాల్లో ‘వందేమాతరం’ గేయంలోని 6 చరణాలను ఆలపించాలని కేంద్రం ఉత్తర్వులిచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాలను వెనక్కి తీసుకోవాలని ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు డిమాండ్ చేసింది. లేదంటే కోర్టులో సవాల్ చేస్తామని ఓ ప్రకటనలో తెలిపింది. ‘ఈ పాటలో దుర్గా, ఇతర దేవతల ఆరాధనకు సంబంధించిన పదాలున్నాయి. అల్లాను మాత్రమే ఆరాధించే ముస్లింల నమ్మకాలకు ఇది విరుద్ధం’ అని పేర్కొంది.

News February 12, 2026

TG CET హాల్ టికెట్లు విడుదల

image

తెలంగాణ గురుకులం కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TG CET–2026) హాల్ టికెట్లు విడుదలయ్యాయి. నేటి నుంచి ఈ నెల 22 వరకు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. 2026-27 అకడమిక్ ఇయర్‌కి సంబంధించి 5-9 తరగతుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను నిర్వహించనున్నారు. హాల్ టికెట్ల డౌన్‌లోడ్ కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News February 12, 2026

ఉత్తరంలో ఇల్లు కడితే కుబేరులు అవుతారా ?

image

ఉత్తరానికి అధిపతి కుబేరుడు. ఆ దిశలో ఇల్లు కడితే సంపన్నులవుతారని కొందరి అభిప్రాయం. అయితే ఇలా ఉత్తరదిశలో ఉన్న ఇంట్లో నివసిస్తున్న అందరూ కుబేరులవుతారనడం అపోహేనని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు స్పష్టం చేస్తున్నారు. ఈ వాస్తు నియమం పాటిస్తే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరిగి సకల కార్యాలు పూర్తయ్యేలా దోహదం చేస్తుందని చెబుతున్నారు. సంపద పెరిగే అవకాశాలు మెరుగుపడుతాయే తప్ప సంపద పెరగదు’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>