News April 4, 2024
ఏపీలో మళ్లీ జగన్ ప్రభుత్వమే: BRS MLA

AP అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ వైసీపీనే గెలుస్తుందని HYD జూబ్లీహిల్స్ MLA మాగంటి గోపీనాథ్(బీఆర్ఎస్) జోస్యం చెప్పారు. ‘చంద్రబాబు పని అయిపోయింది. బీజేపీతో పొత్తు పెట్టుకొని ఆయన చాలా తప్పు చేశారు. జాతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకున్న ప్రాంతీయ పార్టీలేవీ తర్వాతి కాలంలో మనుగడ సాధించిన దాఖలాలు లేవు. పొత్తు తర్వాత జతగూడిన పార్టీలను మింగేస్తాయి’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News December 27, 2025
అల్లు అర్జున్ను మళ్లీ అరెస్ట్ చేస్తారా?

‘పుష్ప-2’ తొక్కిసలాట ఘటనపై పోలీసులు <<18684964>>ఛార్జ్‌షీట్<<>> దాఖలు చేయడంపై మరోసారి హీరో అల్లు అర్జున్ పేరు తెరపైకి వచ్చింది. ఆయనను ఏ-11గా పేర్కొనడంతో బన్నీని మళ్లీ అరెస్ట్ చేస్తారా? అని అభిమానుల్లో ఆందోళన మొదలైంది. అయితే ఛార్జ్‌షీట్ అనేది కేసు పూర్తి వివరాలతో కోర్టుకు సమర్పించే నివేదిక. ఇక్కడ సంధ్య థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగిందని పోలీసులు అందులో పేర్కొనడంతో బన్నీ అరెస్ట్ ఉండకపోవచ్చు!
News December 27, 2025
రాష్ట్రంలోనే ‘ఉపాధి’ పథకం ప్రారంభం.. CWCలో చర్చ

AP: MGNREGA స్కీమ్ ఏర్పాటై 2026 ఫిబ్రవరి 2కు 20 ఏళ్లు పూర్తి అవుతుంది. అనంతపురం జిల్లా బండ్లపల్లిలో నాటి PM మన్మోహన్, సోనియా దాన్ని ప్రారంభించారు. కాగా NDA ప్రభుత్వం మహాత్మాగాంధీ పేరును తొలగించడంపై వివాదం మొదలైంది. దీనిపై CWC భేటీలో చర్చించినట్లు PCC EX చీఫ్ రుద్రరాజు తెలిపారు. JAN 5 నుంచి చేపట్టే ఉద్యమంలో భాగంగా బండ్లపల్లిలో సభ నిర్వహించాలని, దీనికి రావాలని సోనియాను కోరామని తెలిపారు.
News December 27, 2025
2025కు ఈ హీరోలు దూరం!

టాలీవుడ్లో ఈ ఏడాది పలువురు స్టార్ హీరోల సినిమాలు విడుదల కాలేదు. మెగాస్టార్ చిరంజీవి, మహేశ్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్ వంటి స్టార్లు ఈ జాబితాలో ఉన్నారు. వీరు నటిస్తున్న చిత్రాలు ఇంకా షూటింగ్ దశలో ఉండటం, కొన్ని సాంకేతిక అంశాలతో విడుదల వాయిదా వేయడం కారణాలుగా ఉన్నాయి. అటు వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, నిఖిల్ వంటి హీరోలూ ఈ లిస్టులో ఉన్నారు. మీరు ఈ ఏడాది ఏ హీరో సినిమా మిస్ అయ్యారు?


