News April 4, 2024
ఏపీలో మళ్లీ జగన్ ప్రభుత్వమే: BRS MLA

AP అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ వైసీపీనే గెలుస్తుందని HYD జూబ్లీహిల్స్ MLA మాగంటి గోపీనాథ్(బీఆర్ఎస్) జోస్యం చెప్పారు. ‘చంద్రబాబు పని అయిపోయింది. బీజేపీతో పొత్తు పెట్టుకొని ఆయన చాలా తప్పు చేశారు. జాతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకున్న ప్రాంతీయ పార్టీలేవీ తర్వాతి కాలంలో మనుగడ సాధించిన దాఖలాలు లేవు. పొత్తు తర్వాత జతగూడిన పార్టీలను మింగేస్తాయి’ అని వ్యాఖ్యానించారు.
Similar News
News April 18, 2025
TCS లే ఆఫ్స్‌పై ఉద్యోగుల ఫిర్యాదు

USలోని TCS కంపెనీపై ఆ దేశ ‘సమాన ఉపాధి హక్కుల కమిషన్’ విచారణ చేపట్టింది. ఇండియాకు చెందిన హెచ్1బీ వీసాదారులకు లేఆఫ్స్ ఇవ్వకుండా కేవలం దక్షిణాసియేతర ఉద్యోగులనే పక్షపాతంగా తొలగిస్తున్నారని ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. కాగా ఈ ఆరోపణలను TCS ప్రతినిధులు ఖండించారు. మెుదటి నుంచి TCS సంస్థ సమానత్వం, సమగ్రత కల్పించడంతో ముందు స్థానంలో ఉంటుందని తెలిపారు.
News April 18, 2025
భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు

భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు లభించింది. యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్‌లో వీటికి చోటు దక్కింది. ఇది ప్రపంచంలోని ప్రతీ భారతీయుడికి గర్వకారణమని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. భారతీయ సంస్కృతికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు వచ్చిందన్నారు. భగవద్గీత, నాట్యశాస్త్రం శతాబ్దాలుగా దేశ నాగరికతను, చైతన్యాన్ని పెంపొందించాయని పేర్కొన్నారు.
News April 18, 2025
ఏసుక్రీస్తు త్యాగాన్ని గుర్తుచేసుకోవాలి: PM మోదీ

గుడ్‌ఫ్రైడే సందర్భంగా క్రైస్తవులనుద్దేశించి ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ఈ పవిత్ర రోజున ఏసుక్రీస్తు త్యాగాన్ని మనం గుర్తు చేసుకోవాలన్నారు. ఆయనలోని దయ, కరుణ, క్షమాపణ వంటి సద్గుణాలు మనకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని చెప్పారు. ఇటు ఏపీ సీఎం చంద్రబాబు సైతం క్రీస్తు గొప్పతనాన్ని గుర్తు చేశారు. తన శరీరంలోకి మేకులు దించిన సమయంలో కూడా ఏసుక్రీస్తు శాంతిని ప్రబోధించారన్నారు.