News September 11, 2025

ASIA CUP: బంగ్లాదేశ్ టార్గెట్ ఎంతంటే?

image

ఆసియా కప్‌‌‌లో ఇవాళ గ్రూప్-బీ టీమ్స్ బంగ్లాదేశ్, హాంకాంగ్ తలపడుతున్నాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన హాంకాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 143 రన్స్ చేసింది. నిజాఖత్ ఖాన్ 42, జీషన్ అలీ 30, యాసిమ్ 28 రన్స్‌తో రాణించారు. బంగ్లా బౌలర్లలో టస్కిన్, టాంజిమ్, రిషాద్ తలో 2 వికెట్లు పడగొట్టారు. 144 రన్స్ లక్ష్యంతో కాసేపట్లో బంగ్లా ఛేజింగ్ ఆరంభించనుంది.

Similar News

News April 1, 2026

15 ఏళ్ల తర్వాత.. సెన్సస్-2027 ప్రారంభం

image

2011 తర్వాత దేశంలో మళ్లీ జనగణనకు వేళయింది. సెన్సస్-2027 ఇవాళ ప్రారంభమైంది. ఎన్యూమరేటర్లు నివాసాల జాబితా, గణన చేపడతారు. కేంద్రం ప్రతి రాష్ట్రానికి 30 రోజుల సమయం ఇచ్చింది. APలో మే 1-30 మధ్య, TGలో మే 11-జూన్ 9 మధ్య కొనసాగనుంది. దీనికి 15 రోజుల ముందు ప్రజలు తామే స్వయంగా ఆన్‌లైన్‌లో ‘సెల్ఫ్ ఎన్యూమరేషన్’ ద్వారా వివరాలు సమర్పించవచ్చు. ఈ ప్రక్రియ అంతా ముగిశాక 2027 ఫిబ్రవరిలో అసలైన జనగణన మొదలవుతుంది.

News April 1, 2026

మార్కెట్లో బుల్ జోరు!

image

పశ్చిమాసియా యుద్ధ భయాల నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు తేరుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, క్రూడాయిల్ ధర తగ్గడంతో ఇవాళ బుల్ జోరు కొనసాగుతోంది. సెన్సెక్స్ 1,900 పాయింట్లు ఎగసి 73,835 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 570 పాయింట్లు లాభపడి 22,910 వద్ద ట్రేడ్ అవుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభాల్లో ఉన్నాయి.

News April 1, 2026

చికెన్ తింటున్నారా?

image

TGలో ఇవాళ్టి నుంచి చికెన్ షాపుల <<19529303>>బంద్<<>> కొనసాగనుంది. ఈ క్రమంలో హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లకు వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలి. తాజా చికెన్ దొరక్కపోతే నిల్వ ఉంచిన మాంసాన్ని వాడే అవకాశం ఉంది. ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన మాంసంపై బాక్టీరియా చేరుతుంది. ఇలాంటి మాంసం తింటే ఆరోగ్య సమస్యలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి నాన్‌వెజ్ ప్రియులు కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.