News September 11, 2025
పెద్దపల్లి: ‘సెప్టెంబర్ 16న జాబ్‌మేళా’

నిరుద్యోగ యువకుల కోసం సెప్టెంబర్ 16న పెద్దపల్లి కలెక్టరేట్‌లో జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి తిరుపతిరావు తెలిపారు. గూగుల్ పే, హైరింగ్ రిక్వెస్ట్ కంపెనీలో 20 ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు ఉన్నాయన్నారు. బైక్, పాన్ కార్డు, ఆండ్రాయిడ్ మొబైల్ తప్పనిసరి. ఇంటర్/డిగ్రీ ఉత్తీర్ణతతో 18-35 ఏళ్ల వయసు గల వారు అర్హులు. ఆసక్తి గల వారు సర్టిఫికేట్స్ జిరాక్స్‌లతో హాజరుకావాలని సూచించారు.
Similar News
News September 12, 2025
నేడు వైస్ ప్రెసిడెంట్‌గా రాధాకృష్ణన్ ప్రమాణం

భారత 15వ ఉప రాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ఇవాళ ఉ.10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రాష్ట్రపతి భవన్‌లో ప్రెసిడెంట్ ద్రౌపదీ ముర్ము ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. ఈ కార్యక్రమంలో పీఎం నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, NDA కీలక నేతలు, తెలుగు రాష్ట్రాల గవర్నర్లు పాల్గొననున్నారు. ఈ ప్రోగ్రామ్ కోసం ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే.
News September 12, 2025
కూకట్‌పల్లి: హత్య చేసిన ఇంట్లోనే స్నానం చేసిన నిందితుడు

రేణు అగర్వాల్‌ను నిందితుడు అత్యంత కిరాతకంగా హతమార్చాడు. మొదటగా కాళ్లు చేతులు కట్టేసి కత్తితో పొడిచి గొంతు కోసి హతమార్చాడు. వంటింట్లో ఉన్న ప్రెషర్ కుక్కర్‌తో తలపై కొట్టి చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఇంట్లోనే స్నానం చేసి తన స్నేహితుడితో కలిసి బైక్‌పై పరారయ్యాడు. భర్త కుమారుడు ఇంటికి వచ్చి చూసేసరికి రేణు రక్తపు మడుగుల్లో ఉండటాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యారు.
News September 12, 2025
త్వరలో డిగ్రీ, పీజీ కాలేజీల్లో ఫేషియల్ అటెండెన్స్

TG: డిగ్రీ, పీజీ కాలేజీల్లో త్వరలో ఫేషియల్ రికగ్నిషన్ అటెండెన్స్ విధానం అమలు కానుంది. దీనిపై చర్చించేందుకు ఇవాళ అన్ని వర్సిటీల VCలతో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనుంది. స్టూడెంట్స్‌తో పాటు టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికి ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. అన్ని విద్యాసంస్థల్లో ఫేషియల్ అటెండెన్స్‌ను అమల్లోకి తేవాలని ఇటీవల జరిగిన సమీక్షలో సీఎం రేవంత్ ఆదేశించిన సంగతి తెలిసిందే.