News September 12, 2025
భారీగా పడిపోయిన టమాటా, ఉల్లి ధరలు

AP: రాష్ట్రంలో టమాటా, ఉల్లి ధరలు పడిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో టమాటా కిలో రూ.2కి పడిపోయింది. నంద్యాల, మదనపల్లె మార్కెట్లలో రూ.3-రూ.10 వరకు పలికింది. అటు కర్నూల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో వ్యాపారులు ఉల్లి క్వింటా రూ.150 చొప్పున కొనుగోలు చేసినట్లు రైతులు తెలిపారు. దీంతో కూలీ ఖర్చులు కూడా రావట్లేదని వాపోయారు.
Similar News
News September 12, 2025
మెడికల్ కాలేజీల టెండర్లపై జగన్ వార్నింగ్.. సజ్జల ఏమన్నారంటే?

AP: మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయకూడదనే ఉద్దేశంతోనే జగన్ మెడికల్ కాలేజీల టెండర్లపై హెచ్చరికలు జారీ చేశారని YCP సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ‘కోర్ సెక్టార్స్‌లో ప్రభుత్వ ప్రాధాన్యం ఉండాలనేదే మా లక్ష్యం. ప్రభుత్వ సంస్థను ప్రైవేటుపరం చేస్తుంటే కచ్చితంగా హెచ్చరిస్తాం’ అని అన్నారు. ఇక తమ మద్దతుదారులపై అక్రమ కేసులు పెడుతున్నందుకే కొందరు పోలీసులకు వార్నింగ్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు.
News September 12, 2025
లిక్కర్ కేసు నిందితులకు రిమాండ్ పొడిగింపు

AP: లిక్కర్ స్కామ్ కేసులో 10 మంది నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు ఈ నెల 18 వరకు రిమాండ్ పొడిగించింది. ఇవాళ్టితో నిందితుల రిమాండ్ ముగియనుండటంతో సిట్ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. అలాగే మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఫోన్‌ను FSLకు పంపేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఆయన ఫోన్‌ను అధికారులు సీజ్ చేసే అవకాశం ఉంది.
News September 12, 2025
మేం చేసిన ఖర్చు అభివృద్ధిలో కనిపించింది: బుగ్గన

AP:YCP ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తే రాష్ట్రం దివాలా తీస్తోందంటూ ఆనాడు TDP ఆరోపించిందని మాజీ మంత్రి బుగ్గన Way2News కాన్‌క్లేవ్‌లో చెప్పారు. వాటిని మించి ఇచ్చిన అభివృద్ధి హామీలను నెరవేర్చాలని, లేకపోతే తప్పు చేసినట్లు ప్రభుత్వం ఒప్పుకోవాలని కోరారు. YCP హయాంలో చేసిన ఖర్చు అభివృద్ధిలో కనిపించిందన్నారు. తమ ప్రభుత్వంలో GST వసూళ్లు పెరిగితే, కూటమి ప్రభుత్వ హయాంలో ఎందుకు పెరగడంలేదని ప్రశ్నించారు.