News September 12, 2025
CAT-2025: దరఖాస్తుకు ఒక్కరోజే ఛాన్స్

మేనేజ్‌మెంట్ స్కూళ్లలో ప్రవేశాలకు కామన్ అడ్మిషన్ టెస్ట్(CAT)-2025 దరఖాస్తుకు రేపే ఆఖరు తేదీ. డిగ్రీ పాసైన, ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు అప్లై చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డులను NOV 5న రిలీజ్ చేస్తారు. NOV 30న పరీక్ష, 2026, JAN మొదటి వారంలో ఫలితాలు విడుదలవుతాయి. క్యాట్ స్కోరు ఆధారంగా IIM, IIT, NITల్లో MBA, పీహెచ్‌డీ, ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం పొందవచ్చు.
వెబ్‌సైట్: <
Similar News
News February 10, 2026
ప్రైవేటుకు 4 NHలు.. జాబితాలో ఏపీ హైవే

AP: నాలుగు రాష్ట్రాల్లోని 260 కి.మీ పొడవైన 4 జాతీయ రహదారులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు రంగం సిద్ధమైంది. వీటికి రూ.9,500 కోట్లు చెల్లిస్తామని RIIT చేసిన ఆఫర్‌కు NHAI ఆమోదం తెలిపింది. ఇందులో 69 కి.మీ పొడవైన విజయవాడ-చిలకలూరిపేట హైవే కూడా ఉంది. మిగిలిన రహదారులు తమిళనాడు, కర్ణాటక, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో ఉన్నాయి.
News February 10, 2026
షమీకే ఎందుకిలా?

గాయంతో జట్టుకు దూరమై రీఎంట్రీ కోసం ఎదురుచూస్తున్న బౌలర్ మహ్మద్ షమీకి మరోసారి నిరాశే ఎదురైంది. తాజాగా <<19095739>>BCCI<<>> ప్రకటించిన కాంట్రాక్ట్‌లో ఆయనకు చోటు దక్కలేదు. గత కొంతకాలంగా దేశవాళీలో ఆడుతున్నప్పటికీ అతడిని జట్టులోకి తీసుకోకపోవడంపై విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. కాంట్రాక్టు లిస్టులోనూ పేరు లేకపోవడంతో BCCI అతడిని పక్కనపెట్టిందా అనే చర్చ జరుగుతోంది. షమీ గతేడాది మార్చిలో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు.
News February 10, 2026
కోసిన మిరప పంటను ఇలా ఎండబెడితే మేలు

పంట నుంచి కోసిన మిరపకాయలను కుప్పగా పోసి టార్పాలిన్‌తో ఒక రోజంతా కప్పి ఉంచాలి. ఇలా చేస్తే కాయలు అన్నీ ఒకేలా పండుతాయి. తర్వాత కాయలను పాలిథీన్ పట్టాలపై లేదా శుభ్రం చేసిన కాంక్రీటు కల్లాల మీద ఆరబెట్టాలి. ఇసుక లేదా పేడ అలికిన కల్లాలపై ఆరబెట్టకూడదు. రాత్రిపూట కాయలను పట్టాలతో కప్పి ఉదయం ఎండరాగానే పట్టా తీసేయాలి. మిరపలో తేమ 10-11% వరకు వచ్చేలా ఎండబెట్టాలి. లేకపోతే రంగును, మెరుపును కోల్పోయే అవకాశం ఉంది.


