News April 4, 2024

పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై ఫేక్ న్యూస్.. స్పందించిన EC

image

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ కొందరు తప్పుడు సమాచారాన్ని వైరల్ చేస్తూ ఓటర్లను తప్పుదోవ పట్టిస్తున్నారు. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయలేరని ఓ మెసేజ్ వాట్సాప్‌లో చక్కర్లు కొడుతుండగా.. దీనిపై EC స్పందించింది. ఇది తప్పుడు సమాచారమని పేర్కొంది. ఎన్నికల విధుల్లో ఉన్న అర్హులైన అధికారులు ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్‌లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయొచ్చని తెలిపింది.

Similar News

News November 15, 2025

బరువు ఎప్పుడూ ఒకేలా ఉండాలంటే..

image

ఎత్తుకు తగ్గ బరువును మెయింటైన్ చేస్తూ, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరికీ అవసరం. కొన్ని అలవాట్లను పాటిస్తే బరువు పెరగకుండా జాగ్రత్తపడొచ్చంటున్నారు నిపుణులు. రాత్రి 8 తర్వాత ఆహారం తీసుకోకూడదు. ఆలస్యంగా, ఎక్కువ మోతాదులో తినడంతో జీవక్రియలకు అంతరాయం కలుగుతుంది. ప్రాసెస్డ్‌ ఫుడ్‌, నూడిల్స్‌, వేపుళ్లకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. శరీరానికి తగినంత నీరు అందేలా చూసుకోవాలి.

News November 15, 2025

పేదల తరఫున గొంతెత్తుతూనే ఉంటాం: RJD

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమిని చవిచూసిన ఆర్జేడీ ఫలితాలపై తొలిసారి స్పందించింది. ప్రజాసేవ నిరంతర ప్రక్రియ అని, దానికి అంతం లేదని స్పష్టం చేసింది. ఈ క్రమంలో ఎత్తుపల్లాలు సహజమని పేర్కొంది. ఓటమితో విచారం.. గెలుపుతో అహంకారం ఉండబోదని తెలిపింది. ఆర్జేడీ పేదల పార్టీ అని, వారి కోసం తన గొంతును వినిపిస్తూనే ఉంటుందని ట్వీట్ చేసింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ 25 సీట్లకు పరిమితమైన విషయం తెలిసిందే.

News November 15, 2025

రైల్ వీల్ ఫ్యాక్టరీలో స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు

image

బెంగళూరులోని <>రైల్<<>> వీల్ ఫ్యాక్టరీ స్పోర్ట్స్ కోటాలో 15 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్, కబడ్డీ, ఫుట్‌బాల్, చెస్‌లో పతకాలు సాధించినవారు ఈనెల 29వరకు అప్లై చేసుకోవచ్చు. టెన్త్, ITI, ఇంటర్‌ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థుల వయసు 18- 25ఏళ్ల మధ్య ఉండాలి. వెబ్‌సైట్: https://rwf.indianrailways.gov.in/