News April 4, 2024
పోస్టల్ బ్యాలెట్ ఓట్లపై ఫేక్ న్యూస్.. స్పందించిన EC

సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న వేళ కొందరు తప్పుడు సమాచారాన్ని వైరల్ చేస్తూ ఓటర్లను తప్పుదోవ పట్టిస్తున్నారు. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయలేరని ఓ మెసేజ్ వాట్సాప్‌లో చక్కర్లు కొడుతుండగా.. దీనిపై EC స్పందించింది. ఇది తప్పుడు సమాచారమని పేర్కొంది. ఎన్నికల విధుల్లో ఉన్న అర్హులైన అధికారులు ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్‌లో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేయొచ్చని తెలిపింది.
Similar News
News April 22, 2025
BRS మాజీ MLA చెన్నమనేనిపై CID కేసు

TG: వేములవాడ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌పై సీఐడీ కేసు నమోదు చేసింది. భారత పౌరసత్వం లేకున్నా తప్పుడు సర్టిఫికెట్లతో ఎన్నికల్లో పోటీ చేశారనేదానిపై ఈ కేసు నమోదైంది. జర్మనీ పౌరసత్వాన్ని దాచి ఆయన ఇక్కడ ఎన్నికల్లో పోటీ చేసి లబ్ధి పొందారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు సీఐడీ FIR నమోదు చేసింది.
News April 22, 2025
RESULTS: ఫస్ట్ ర్యాంక్ ఈమెకే

మన దేశంలో అత్యంత కఠినమైన పరీక్ష UPSC నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్. తాజా సివిల్స్ ఫలితాల్లో యూపీ ప్రయాగ్‌రాజ్‌కు చెందిన శక్తి దూబే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఈమె అలహాబాద్ యూనివర్సిటీలో బయోకెమిస్ట్రీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 2018 నుంచి సివిల్స్ కోసం ప్రిపేర్ అవుతున్నారు. శక్తి సివిల్స్‌లో పొలిటికల్ సైన్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆప్షనల్ సబ్జెక్టుగా తీసుకున్నారు.
News April 22, 2025
TDP MLAలను చెప్పులతో కొడతారు: రోజా

AP: చంద్రబాబు అధికారంలోకి వచ్చి ఏడాదవుతున్నా ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని YCP నేత రోజా ఆరోపించారు. TDP MLAలు ప్రజల్లోకి వెళ్తే చెప్పులతో కొడతారని ఆమె విమర్శించారు. ‘చేతకాని హామీలు ఇచ్చి రైతులు, మహిళలు, నిరుద్యోగులను మోసం చేశారు. హామీలు అమలు చేయలేకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. లిక్కర్‌స్కామ్‌లో మిథున్ రెడ్డిని అక్రమంగా ప్రశ్నిస్తున్నారు. దీనిపై PM మోదీ స్పందించాలి’ అని ఆమె డిమాండ్ చేశారు.