News September 12, 2025
క్యాన్సర్‌పై పోరాటం చేస్తున్నాం: సత్యకుమార్

క్యాన్సర్‌కు మంచి వైద్యం అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు మంత్రి సత్యకుమార్ Way2News Conclaveలో పేర్కొన్నారు. ‘క్యాన్సర్ కారణంగా అమ్మ, అక్కని కోల్పోయాను. 18Y+ అమ్మాయిలకు బ్రెస్ట్, 30Y+ మహిళలకు సర్వైకల్ క్యాన్సర్‌కు స్క్రీనింగ్ చేస్తున్నాం. ఇప్పటికే 2.92 కోట్ల మందికి ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేశాం. బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్‌కు స్త్రీలు ముందుకు రావట్లేదు’ అని తెలిపారు.
Similar News
News March 16, 2026
కొత్త సబ్జెక్టులతో UG, PG కోర్సులు

TG: పాత డిగ్రీ కోర్సులకు కాలం చెల్లింది. అవి నేటి అవసరాలకు తగ్గట్టు ఉంటేనే ఉపాధి అవకాశాలు. ఈదిశగా TGCHE వాటిని ప్రక్షాళించింది. UG, PGలలో డిఫెన్స్, సైబర్ సెక్యూరిటీ, ల్యాండ్, అగ్రికల్చర్, ఎయిర్ లైన్స్, స్పేస్, మారిటైమ్, ఫిన్‌టెక్, INT.బ్యాంకింగ్, ఫైనాన్స్, మల్టీమీడియా, యానిమేషన్, బయోమెడిక్స్, MED.మైక్రో బయాలజీ, ఇమ్యూనాలజీ వంటివి పెట్టింది. ఈ సమాచారాన్ని ‘https://tgche.ac.in’లో పొందుపరిచింది.
News March 16, 2026
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు: APSDMA

AP: రేపు పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని APSDMA తెలిపింది. SKLM, VZM, మన్యం, అల్లూరి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పింది. పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూ.గో., ప.గో., ELR, కృష్ణా, NTR, GNT, KNL, NDYL, ATP, TPT జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.
– ఇప్పటివరకు చదవని వార్తల కోసం పైన అన్‌రీడ్ బటన్ క్లిక్ చేసి UPDATEలో ఉండండి.
News March 16, 2026
నటి ప్రత్యూష మృతి కేసు.. లొంగిపోయిన సిద్ధార్థ్

నటి ప్రత్యూష డెత్ <<19164468>>కేసులో<<>> నిందితుడు సిద్ధార్థ్ రెడ్డి నాంపల్లి కోర్టులో లొంగిపోయాడు. అతడికి హైకోర్టు విధించిన రెండేళ్ల శిక్షను సమర్థించిన సుప్రీంకోర్టు.. మార్చి 16వ తేదీలోగా లొంగిపోవాలని 4 వారాల క్రితం తీర్పునిచ్చింది. దీంతో అతడు ఈరోజు లొంగిపోయాడు. ప్రత్యూష ఆత్మహత్య చేసుకునేలా సిద్ధార్థ్ ప్రేరేపించినట్లుగా కోర్టు నిర్ధారించిన సంగతి తెలిసిందే.


