News September 13, 2025
TODAY HEADLINES

*మంగళగిరిలో Way2News Conclave.. ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు
*మూడేళ్లలో 17 మెడికల్ కాలేజీలు రన్ అవుతాయి: CM చంద్రబాబు
*గుంటూరు-విజయవాడ మధ్య రాజధాని నిర్మిస్తాం: సజ్జల
*ఉపరాష్ట్రపతిగా CP రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం
*ఈనెల 15 నుంచి TGలో కాలేజీలు బంద్: FATHI
*AP లిక్కర్ కేసులో 10మంది నిందితులకు రిమాండ్ పొడిగింపు
*నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కి
*USలో భారతీయుడిని తల నరికి దారుణ హత్య
Similar News
News September 13, 2025
ALERT.. అతి భారీ వర్షాలు

ఉపరితల ఆవర్తనం ప్రభావంతో TGలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. ఇవాళ NML, NZB, కామారెడ్డి, MDK, సంగారెడ్డి జిల్లాల్లో, రేపటి నుంచి ఈ నెల 16 వరకు ADB, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, NZB భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. అటు అల్పపీడన ప్రభావంతో APలోని ఏలూరు, NTR, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో నేడు భారీ వర్షాలు కురుస్తాయని APSDMA అంచనా వేసింది.
News September 13, 2025
బీసీసీఐ అధ్యక్షుడిగా కిరణ్ మోరే?

BCCI తదుపరి అధ్యక్షుడిగా భారత మాజీ వికెట్ కీపర్ కిరణ్ మోరే బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దాదాపు అన్ని రాష్ట్రాల అసోసియేషన్‌లు ఇందుకు పాజిటివ్‌గా ఉన్నట్లు సమాచారం. ఈ నెల 28న ఎన్నికలు జరగకపోవచ్చని, ఏకగ్రీవం అయ్యే ఛాన్సుందని ఇటీవల IPL ఛైర్మన్ అరుణ్ ధుమాల్ కూడా అభిప్రాయపడ్డారు. కిరణ్ మోరే IND తరఫున 49 టెస్టులు, 94 ODIలు ఆడారు. 1988, 1991 ఆసియా కప్ విన్నింగ్ టీమ్‌లో సభ్యుడిగా ఉన్నారు.
News September 13, 2025
థియేటర్లలో ‘మహావతార్ నర్సింహా’.. @50 డేస్

మహా విష్ణువు నరసింహావతారం ఆధారంగా తెరకెక్కిన ‘మహావతార్ నర్సింహా’ యానిమేటెడ్ సినిమా థియేటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం 200కు పైగా థియేటర్లలో ఈ సినిమా ఆడుతోందని నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ప్రకటించింది. జులై 25న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇప్పటివరకు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి.