News April 4, 2024

ఎంపీ నవనీత్ రాణాకు సుప్రీంకోర్టులో ఊరట

image

మహారాష్ట్రలోని అమరావతి MP నవనీత్ రాణాకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆమె క్యాస్ట్ సర్టిఫికెట్‌ను ధర్మాసనం సమర్థించింది. సర్టిఫికెట్‌ను రద్దు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పక్కనపెట్టింది. ఆమె ‘మోచి’ కుల ధ్రువీకరణ పత్రాన్ని మోసపూరితంగా పొందారని పేర్కొంటూ హైకోర్టు సర్టిఫికెట్‌ను రద్దు చేయగా, ఆమె SCని ఆశ్రయించారు. తాజాగా ఊరట లభించడంతో నేడు అమరావతి BJP MP అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు.

Similar News

News March 16, 2026

క్యాన్సర్‌తో ప్రతి 18నిమిషాలకు ఒకరు మృతి

image

తెలంగాణలో క్యాన్సర్ మహమ్మారి విజృంభిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి 10 నిమిషాలకు ఒక కొత్త క్యాన్సర్ కేసు నమోదవుతుండగా, ప్రతి 18 నిమిషాలకు ఒకరు మరణిస్తున్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం.. 2025లో రాష్ట్రవ్యాప్తంగా 53,565 కొత్త కేసులు, 29,300 మరణాలు సంభవించాయి. దేశ సగటుతో పోలిస్తే ఇక్కడ ముప్పు 15% ఎక్కువగా ఉంది. పొగాకు వాడకం, ఆహారపు అలవాట్లు, జీవనశైలి మార్పులే ఇందుకు ముఖ్య కారణాలు.

News March 16, 2026

భారీగా తగ్గిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఈరోజు ₹2,240 తగ్గి ₹1,57,420కు చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర ₹2,050 తగ్గి ₹1,44,300 వద్ద స్థిరపడింది. ఇక కిలో వెండి ధర ఈరోజు ₹4వేలు తగ్గి ₹2,76,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు ఉండొచ్చు.

News March 16, 2026

CNG సరఫరాలో కొరత లేదు: కేంద్రం

image

దేశంలో ఇంధన లభ్యతపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం పేర్కొంది. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (CNG), పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) సరఫరా సాఫీగా సాగుతోందని స్పష్టం చేసింది. దేశంలో క్రూడ్ ఆయిల్ సరిపడా ఉందని.. రిఫైనరీలు అన్నీ ఫుల్ కెపాసిటీతో పనిచేస్తున్నాయంది. పెట్రోల్ పంప్స్‌లో ఎలాంటి కొరత లేదని పేర్కొంది. దేశానికి శివాలిక్, నందాదేవి నౌకల ద్వారా మరో 92,712 టన్నుల LPG రానున్నట్లు తెలిపింది.