News April 4, 2024
వడగాలుల హెచ్చరిక.. ఆ జిల్లాలకు అలర్ట్

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ్టి నుంచి 3 రోజులపాటు తీవ్రమైన వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సత్యసాయి, కడప, నెల్లూరు, అనంతపురం, నంద్యాల, కర్నూలు, ప్రకాశం, పల్నాడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని, బయటకు వెళ్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News January 12, 2026
గోల్డెన్ గ్లోబ్ అవార్డుల విజేతలు వీరే..

లాస్ ఏంజెలెస్‌లో 83వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుక అట్టహాసంగా జరుగుతోంది. బెస్ట్ యాక్టర్-తిమోతీ చలామెట్(మార్టీ సుప్రీం), బెస్ట్ డైరెక్టర్-పాల్ థామస్ అండర్సన్(వన్ బాటిల్ ఆఫ్టర్ అనెదర్), బెస్ట్ సినిమాటిక్ & బాక్సాఫీస్ అచీవ్‌మెంట్-(సిన్నర్స్), బెస్ట్ యానిమేటెడ్ మోషన్ పిక్చర్-KPop డెమన్ హంటర్స్, బెస్ట్ ఫీమేల్ యాక్టర్-రోజ్ బిర్నే(If I Had Legs I’d Kick You) అవార్డులు గెలుచుకున్నారు.
News January 12, 2026
వచ్చే నెలలోనే పరిషత్ ఎన్నికలు?

TG: మునిసిపల్ ఎన్నికలవగానే FEB చివరి వారం లేదా MAR తొలి వారంలో పరిషత్ ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించనున్నట్లు సమాచారం. కొత్త ఆర్థిక సంవత్సరంలో 16వ ఆర్థిక సంఘం అమల్లోకి రానుంది. పరిషత్‌లకు ₹550Cr పెండింగ్ నిధులు రావాలంటే 15వ ఆర్థిక సంఘం కాలపరిమితి ముగియడానికి నెల రోజుల ముందే ఎలక్షన్స్ నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది.
News January 12, 2026
వెనిజులా అధ్యక్షుడిని నేనే.. ట్రంప్ సంచలన ప్రకటన

వెనిజులా తాత్కాలిక అధ్యక్షుడిని తానేనంటూ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ ద్వారా వెల్లడించారు. మదురో అరెస్ట్ తర్వాత వెనిజులా తాత్కాలిక ప్రెసిడెంట్‌గా డెల్సీ రోడ్రిగ్స్ నియమితులైన విషయం తెలిసిందే. అయితే ఆ దేశంపై పూర్తి ఆధిపత్యం కోసం చూస్తున్న ట్రంప్ ఏకంగా అధ్యక్షుడిని తానేనంటూ పై ఫొటోను పోస్ట్ చేశారు.


