News April 4, 2024
వడగాలుల హెచ్చరిక.. ఆ జిల్లాలకు అలర్ట్

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ్టి నుంచి 3 రోజులపాటు తీవ్రమైన వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సత్యసాయి, కడప, నెల్లూరు, అనంతపురం, నంద్యాల, కర్నూలు, ప్రకాశం, పల్నాడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని, బయటకు వెళ్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News April 19, 2026
ఇంటర్ సెకండియర్‌కూ ఇంప్రూవ్‌మెంట్.. ఫీజు ఎంతంటే?

AP: ఈ ఏడాది నుంచి ఇంటర్ సెకండియర్ ఫెయిల్, పాసైన విద్యార్థులు సైతం <<19683959>>ఇంప్రూవ్‌మెంట్<<>> రాసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. వీరు రూ.600 ఫీజుతోపాటు ఒక్కో సబ్జెక్టుకు రూ.160 చొప్పున చెల్లించాలని ఇంటర్ బోర్డు వెల్లడించింది. ఇటీవల పబ్లిక్ పరీక్షలకు కేటాయించిన ఐడీ నంబరుతోనే రేపటి నుంచి ఈ నెల 27 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. కాగా సప్లిమెంటరీ పరీక్షలకూ రేపటి నుంచి అప్లై చేసుకోవచ్చు.
News April 19, 2026
నేడే అక్షయ తృతీయ.. బంగారం ధర ఎంతంటే?

ఇవాళ అక్షయ తృతీయ కావడంతో చిన్న బంగారు వస్తువైనా కొని ఇంటికి తెస్తే సిరిసంపదలు వెల్లివిరుస్తాయని చాలామంది నమ్మకం. అయితే పసిడి ధరలు రికార్డు స్థాయిలో ఉండటం కొనుగోలుదారులకు ఆందోళన కలిగిస్తోంది. కాగా నేడు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.1,55,780 వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,42,800కు విక్రయిస్తున్నారు.
News April 19, 2026
‘లెనిన్’లో నాగ్ మార్పులు?

మురళీ కిశోర్ డైరెక్షన్‌లో అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన ‘లెనిన్’ షూటింగ్ ఇప్పటికే పూర్తయ్యింది. తాజాగా ఈ సినిమా ఫైనల్ కట్ చూసిన నాగార్జున కొన్ని మార్పులను సూచించినట్లు సమాచారం. దీంతో మూవీని ట్రిమ్ చేసే పనిలో ఎడిటర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ నుంచి ఇటీవల విడుదలైన <<19666338>>‘యెట్టా యెట్టా’<<>> పాట ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం జూన్ 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.


