News April 5, 2024
అత్యవసర మందుల ధరలు పెరగవు: కేంద్రమంత్రి

అత్యవసర ఔషధాల ధరలు పెరగనున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ కొట్టిపారేశారు. అందులో ఏ మాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణంలో పెరుగుదల లేనందున ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఔషధాల ధరలు పెరగవని చెప్పారు. టోకు ధరల ఆధారంగానే నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఏటా రేట్లను సవరిస్తుంటుందని తెలిపారు.
Similar News
News November 1, 2025
రోహిత్, కోహ్లీ కొనసాగుతారు: ఐపీఎల్ ఛైర్మన్

భారత క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీపై IPL ఛైర్మన్ అరుణ్ ధుమాల్ ప్రశంసలు కురిపించారు. వాళ్లిద్దరూ గొప్ప ఆటగాళ్లని అన్నారు. ‘రోహిత్, కోహ్లీ వెళ్లిపోతారని అందరూ అనుకుంటున్నారు. కానీ ఎక్కడికీ వెళ్లరు. 50ఓవర్ల ఫార్మాట్ ఆడతారు’ అని అన్నారు. క్రికెట్ కోసం వారు జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. వైభవ్ సూర్యవంశీ వంటి వారితో టీమ్ ఇండియా బెంచ్ బలంగా ఉందన్నారు.
News November 1, 2025
ఇవాళ్టి నుంచి శుభకార్యాలు ప్రారంభం!

నేడు కార్తీక శుక్ల ఏకాదశి. దీనినే ఉత్థాన ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజునే శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల యోగ నిద్ర నుంచి మేల్కొంటారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. దీంతో చాతుర్మాసం ముగిసి నేటి నుంచి పెళ్లిళ్లు సహా అన్ని రకాల శుభకార్యాలు తిరిగి ప్రారంభమవుతాయి. భక్తులు ఉపవాస దీక్షతో విష్ణుమూర్తిని పూజిస్తూ, సాయంత్రం తులసి వివాహం నిర్వహిస్తారు. ఈ ఏకాదశి సర్వపాపాలను తొలగిస్తుందని నమ్మకం.
News November 1, 2025
10కి తక్కువ లేదా 150కి ఎక్కువ.. ప్రశాంత్ కిశోర్ ఆసక్తికర వ్యాఖ్యలు

బిహార్ ఎన్నికల్లో తాము 10 కన్నా తక్కువ లేదా 150 కన్నా ఎక్కువ సీట్లు సాధిస్తామని జన్ సురాజ్ పార్టీ ఫౌండర్ ప్రశాంత్ కిశోర్ అన్నారు. ‘రాష్ట్ర ప్రజలు మా పార్టీని ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. ఎన్డీయేకు, ప్రతిపక్ష కూటమికి ఓటు వేయాలని వారు అనుకోవట్లేదు. 160-170 సీట్లలో ట్రయాంగిల్ ఫైట్ ఉంటుంది’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఎన్నికలకు ముందు, తర్వాత ఎవరితోనూ పొత్తు పెట్టుకోబోమని స్పష్టంచేశారు.


