News April 5, 2024
అత్యవసర మందుల ధరలు పెరగవు: కేంద్రమంత్రి
అత్యవసర ఔషధాల ధరలు పెరగనున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని కేంద్రమంత్రి మన్సుఖ్ మాండవీయ కొట్టిపారేశారు. అందులో ఏ మాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణంలో పెరుగుదల లేనందున ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఔషధాల ధరలు పెరగవని చెప్పారు. టోకు ధరల ఆధారంగానే నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రైసింగ్ అథారిటీ ఏటా రేట్లను సవరిస్తుంటుందని తెలిపారు.
Similar News
News January 14, 2025
భారత క్రికెటర్లకు BCCI షాక్?
ఆస్ట్రేలియాతో BGT సిరీస్ వైఫల్యంతో BCCI ప్లేయర్లకు షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక నుంచి ఆటతీరు ప్రకారం చెల్లింపులు చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. దీని ప్రకారం పర్ఫార్మెన్స్ సరిగా లేకుంటే వారి సంపాదనలో కోత పడనుంది. ఈ నిర్ణయంతో క్రికెటర్లు అలర్ట్‌గా ఉంటారని కొందరు అంటుంటే.. ఒత్తిడి పెరుగుతుందని మరికొందరు వాదిస్తున్నారు. దీనిపై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇది కరెక్టేనా? మీ కామెంట్?
News January 14, 2025
‘గేమ్ ఛేంజర్’ హిందీ కలెక్షన్స్ ఎంతంటే?
రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సినిమా హిందీ వెర్షన్‌కు 4 రోజుల్లో ₹29.01కోట్ల వసూళ్లు (నెట్) వచ్చినట్లు బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. తొలి రోజు ₹8.64 కోట్లు రాగా, తర్వాతి 3 రోజుల్లో వరుసగా ₹8.43, ₹9.52, ₹2,42 వచ్చినట్లు పేర్కొన్నాయి. శంకర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు వరల్డ్ వైడ్‌గా తొలి రోజు ₹186కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు మూవీ టీమ్ ప్రకటించింది. ఇప్పటివరకు ఎంత వసూలు చేసిందనేది వెల్లడించాల్సి ఉంది.
News January 14, 2025
జాతీయ పసుపు బోర్డు ప్రారంభం
TG: నిజామాబాద్‌లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభమైంది. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ వర్చువల్ విధానంలో దీన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ధర్మపురి అర్వింద్, పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి, ఎమ్మెల్యేలు సూర్యనారాయణ, రాకేశ్ రెడ్డి, పెద్దఎత్తున రైతులు పాల్గొన్నారు.