News April 5, 2024
‘పెనమలూరు’లో పవర్ ఎవరిదో?

AP: కృష్ణా(D) పెనమలూరు రాజకీయాలు ఎప్పుడూ హాట్‌హాట్‌గా ఉంటాయి. 2008లో ఈ సెగ్మెంట్ ఏర్పడింది. 2009లో కాంగ్రెస్, 14లో TDP, 19లో YCP గెలుపొందాయి. మంత్రి, పెడన MLA జోగి రమేశ్‌ను YCP ఇక్కడి నుంచి పోటీ చేయిస్తోంది. పథకాల లబ్ధిదారుల ఓట్లు కలిసొస్తాయని అంచనా వేస్తోంది. నిత్యం ప్రజల్లో ఉండటం, గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి, క్యాడర్ సపోర్ట్‌తో గెలుస్తానని TDP అభ్యర్థి బోడె ప్రసాద్ ధీమాగా ఉన్నారు.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News January 20, 2026
BJP కొత్త బాస్‌కు అగ్నిపరీక్షగా 5 రాష్ట్రాల ఎన్నికలు!

BJP నూతన అధ్యక్షుడు నితిన్ నబీన్‌కు ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికలు పరీక్షగా మారనున్నాయి. WB, కేరళ, TN, అస్సాం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలను విజయవంతంగా ఎదుర్కోవడం ఆయన ముందున్న సవాల్. ముఖ్యంగా షా, నడ్డా హయాంలో పార్టీ సాధించిన విజయాల పరంపరను నిలబెట్టడం నబీన్‌కు అగ్నిపరీక్షే. దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయడం, బెంగాల్లో అధికారం దిశగా అడుగులు వేయడంపైనే ఆయన భవిష్యత్తు ఆధారపడి ఉంది!
News January 20, 2026
ఇన్స్ట్రుమెంటేషన్ లిమిటెడ్‌లో అప్రెంటిస్ పోస్టులు

<
News January 20, 2026
ఒక్క రోజే రూ.12,000 పెరిగిన వెండి ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ వెండి, బంగారం ధరలు భారీగా పెరిగాయి. కేజీ సిల్వర్ రేటు ఏకంగా రూ.12,000 పెరిగి రూ.3,30,000కు చేరింది. అటు 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.1,040 పెరిగి రూ.1,47,280కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.950 ఎగబాకి రూ.1,35,000 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.


