News April 5, 2024
HYD: బాలికపై కానిస్టేబుల్ అత్యాచారం

బాలికపై కానిస్టేబుల్ అత్యాచారం చేశాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది. హబీబ్‌నగర్ పోలీసుల వివరాల ప్రకారం.. మీర్‌చౌక్ హెడ్ క్వార్టర్స్‌లో గోపి కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. సీతారాంబాగ్‌లో నివాసం ఉండే ఇతడు మార్చి 30న తమ కూతురిపై అత్యాచారం చేసినట్లు బాలిక తల్లిదండ్రులు హబీబ్‌నగర్ PSలో ఫిర్యాదు చేశారు. పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు గోపిని రిమాండ్‌కు తరలించారు.
Similar News
News January 15, 2026
BREAKING: టెర్రస్ వార్.. HYDలో చిందిన రక్తం

అత్తాపూర్ PS పరిధిలోని పాండురంగనగర్‌బస్తీలో పతంగులు ఎగరేస్తున్న సమయంలో రెండు అపార్ట్‌మెంట్‌ల వాసుల మధ్య ఘర్షణ జరిగింది. మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు ఖాళీ సీసాలను పక్క బిల్డింగ్‌పైకి విసిరారు. కొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయగా గొడవ జరిగింది. కొందరు యువకులు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఇరు వర్గాలకు గాయాలు అయ్యాయి. ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు.
News January 15, 2026
HYD: రోడ్డు మధ్యలో మెట్రో రైల్!

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఫ్యూచర్ సిటీకి వెళ్లే దారిలో మెట్రో అధికారులు ఒక సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 17 కిలోమీటర్ల దూరం మెట్రో పిల్లర్ల మీద కాకుండా నేల మీదే (At-grade) పరుగెత్తబోతోంది. ఇది కార్ల మధ్యలో వెళ్లే ట్రైన్ కాదు బాసూ. 100 మీటర్ల వెడల్పు ఉన్న రోడ్డు మధ్యలో ప్రత్యేకంగా కంచె వేసి ఈ ట్రాక్ నిర్మిస్తారు. దీనివల్ల కిలోమీటరుకు అయ్యే నిర్మాణ ఖర్చు దాదాపు 40% తగ్గుతుంది.
News January 15, 2026
HYD: ట్రాకులు రెడీ అవ్వకముందే రైళ్ల ఆర్డర్

సాధారణంగా మెట్రో స్టేషన్లు అన్నీ కట్టాక రైళ్లు కొంటారు. కానీ, మన అధికారులు మాత్రం పని మొదలవ్వకముందే 60 కొత్త కోచ్‌ల కోసం జనవరి 14న టెండర్లు పిలిచారు. దీన్నే “జంప్-స్టార్ట్” ప్లాన్ అంటున్నారు. ఎందుకంటే రైళ్లు రావడానికి రెండేళ్లు పడుతుంది, అందుకే ట్రాకులు తయారయ్యే లోపే రైళ్లను ప్లాట్‌ఫామ్ మీద ఉంచాలని ఈ ముందస్తు ప్లాన్ వేశారు. ఇందులో కెమెరాలు, సెన్సార్లు కూడా అదిరిపోయే రేంజ్‌లో ఉంటాయట.


