News January 15, 2026
HYD: ట్రాకులు రెడీ అవ్వకముందే రైళ్ల ఆర్డర్

సాధారణంగా మెట్రో స్టేషన్లు అన్నీ కట్టాక రైళ్లు కొంటారు. కానీ, మన అధికారులు మాత్రం పని మొదలవ్వకముందే 60 కొత్త కోచ్‌ల కోసం జనవరి 14న టెండర్లు పిలిచారు. దీన్నే “జంప్-స్టార్ట్” ప్లాన్ అంటున్నారు. ఎందుకంటే రైళ్లు రావడానికి రెండేళ్లు పడుతుంది, అందుకే ట్రాకులు తయారయ్యే లోపే రైళ్లను ప్లాట్‌ఫామ్ మీద ఉంచాలని ఈ ముందస్తు ప్లాన్ వేశారు. ఇందులో కెమెరాలు, సెన్సార్లు కూడా అదిరిపోయే రేంజ్‌లో ఉంటాయట.
Similar News
News April 20, 2026
కొడంగల్: CM ఇలాకాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో రూ.224 కోట్లతో 450 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మిస్తున్నారు. కాగా, రాష్ట్రంలోని పెద్ద సర్కార్ దవాఖానాలైన గాంధీ (2,000+ పడకలు), ఉస్మానియా (1,168+ పడకలు) తర్వాత, ప్రాంతీయ స్థాయిలో ఇంతటి ఆధునిక వైద్యశాల రావడం ఇదే తొలిసారి. ఈ భారీ నిర్మాణం పూర్తయితే కొడంగల్‌తో పాటు పరిసర జిల్లాలకు ఎంతో ఉపయోగపడనుంది.

HYDలో త్వరలో మరో IVF సెంటర్

HYD హైకోర్టు సమీపంలోని పేట్లబురుజు ప్రసూతి ఆస్పత్రిలో త్వరలో IVF కేంద్రం అందుబాటులోకి రానుంది. గాంధీ ఆసుపత్రిలో IVF సెంటర్ సక్సెస్ అయిన నేపథ్యంలో ఇక్కడా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు DME నరేందర్ కుమార్ తెలిపారు. సుమారుగా 490 పడకల సామర్థ్యంతో, డాక్టర్లతో అద్భుతమైన సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రెగ్నెన్సీ పరీక్షలు చేయడం, పసిపిల్లలకు వైద్యం, పిల్లల తల్లులకు అడ్వాన్స్‌డ్ వైద్యం అందించనున్నారు.