News April 5, 2024
స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపని రెపో రేటు!

రెపో రేట్‌లో ఎలాంటి మార్పులు చేయట్లేదని RBI ప్రకటించినా అది స్టాక్ మార్కెట్లపై పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. 60 పాయింట్ల స్వల్ప నష్టంతో 74160 వద్ద సెన్సెక్స్.. 24 పాయింట్ల లాస్‌తో 22,490 వద్ద నిఫ్టీ ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. రియల్టీ రంగం షేర్లు రాణించినా ఇతర ప్రధాన రంగాల షేర్లు మందకొడిగా సాగుతున్నాయి. HDFC బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, ఎస్‌బీఐ లైఫ్, కొటక్ బ్యాంక్ టాప్ గెయినర్లుగా ఉన్నాయి.
Similar News
News December 25, 2025
వాట్సాప్ ‘బ్లాక్’ మిస్టరీ: ఆ నంబర్ల డేటా కోరిన ప్రభుత్వం!

ఈ ఏడాది ప్రతినెలా సగటున కోటి ఇండియన్ అకౌంట్స్‌ను వాట్సాప్ బ్లాక్ చేసింది. ఆన్‌లైన్ ఫ్రాడ్స్, స్కామ్స్ పెరగడమే దీనికి కారణం. అయితే ఏ నంబర్లను బ్యాన్ చేశారో ప్రభుత్వంతో షేర్ చేయడం లేదు. డిజిటల్ అరెస్ట్ వంటి స్కామ్స్ వాట్సాప్ ద్వారానే జరుగుతున్నాయి. సిమ్ కార్డు లేకపోయినా ఇవి పనిచేస్తాయి. కాబట్టి నిందితులను పట్టుకోవడం సవాలుగా మారింది. అందుకే బ్యాన్ చేసిన నంబర్ల వివరాలను ప్రభుత్వం కోరుతోంది.
News December 25, 2025
మహేశ్ న్యూ లుక్.. రాముడి పాత్ర కోసమే!

నిన్న మొన్నటి వరకు సూపర్ స్టార్ మహేశ్ బాబు లాంగ్ హెయిర్, గడ్డంతో కాస్త రగ్గుడ్ లుక్‌లో కనిపించారు. ఇప్పుడు క్లీన్ షేవ్ చేసుకుని మిల్క్ బాయ్‌లా మారిపోయారు. వారణాసి మూవీలో ఆయన రాముడిగా కనిపిస్తారని ఇప్పటికే రాజమౌళి ప్రకటించారు. ఇటీవల ఒక షెడ్యూల్ పూర్తైందని <<18653569>>ప్రకాశ్ రాజ్<<>> ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. కొత్త షెడ్యూల్‌లో రాముడి పాత్ర షూట్ కోసమే ఇలా గెటప్ మార్చేశారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
News December 25, 2025
2049 నాటికి అరుణాచల్ హస్తగతమే చైనా లక్ష్యం: US రిపోర్ట్

అరుణాచల్‌ను చైనా తన ‘కోర్ ఇంట్రెస్ట్’ జాబితాలో చేర్చినట్లు అమెరికా <<18660718>>నివేదిక<<>> వెల్లడించింది. 2049 నాటికి తైవాన్‌తో పాటు అరుణాచల్‌ను హస్తగతం చేసుకోవడమే ఆ దేశ లక్ష్యమని పేర్కొంది. సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గుతున్నట్లు కనిపిస్తున్నా.. డ్రాగన్ తన సైనిక బలాన్ని పెంచుతూ భారత్‌పై ఒత్తిడి తెస్తోందని తెలిపింది. అరుణాచల్ వాసుల పాస్‌పోర్ట్‌ల విషయంలో వేధింపులకు పాల్పడుతున్న విషయాన్ని గుర్తుచేసింది.


