News April 5, 2024

స్టాక్ మార్కెట్లపై ప్రభావం చూపని రెపో రేటు!

image

రెపో రేట్‌లో ఎలాంటి మార్పులు చేయట్లేదని RBI ప్రకటించినా అది స్టాక్ మార్కెట్లపై పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. 60 పాయింట్ల స్వల్ప నష్టంతో 74160 వద్ద సెన్సెక్స్.. 24 పాయింట్ల లాస్‌తో 22,490 వద్ద నిఫ్టీ ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. రియల్టీ రంగం షేర్లు రాణించినా ఇతర ప్రధాన రంగాల షేర్లు మందకొడిగా సాగుతున్నాయి. HDFC బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్, ఎస్‌బీఐ లైఫ్, కొటక్ బ్యాంక్ టాప్ గెయినర్లుగా ఉన్నాయి.

Similar News

News January 17, 2025

సంక్రాంతి సెలవుల తర్వాత కాలేజీలు

image

TG: రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు నిన్నటితో సంక్రాంతి సెలవులు ముగిశాయి. దీంతో నేటి నుంచి కాలేజీ విద్యార్థులు తరగతులకు హాజరు కానున్నారు. మరోవైపు స్కూళ్లకు సెలవులు నేటితో ముగియనుండటంతో రేపు పాఠశాలలన్నీ తిరిగి తెరుచుకోనున్నాయి. ఆదివారం వరకు సెలవులు పొడిగించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. అటు ఏపీలో స్కూళ్లు 20న పునః ప్రారంభం కానున్నాయి.

News January 17, 2025

అతడి వల్లే భారత్ ఓడిపోయింది: అశ్విన్

image

BGTలో టీమ్ ఇండియా ఓడిపోవడానికి ఆస్ట్రేలియా బౌలర్ బోలాండే కారణమని మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అన్నారు. ‘కమిన్స్ అద్భుతంగా రాణించారని అందరూ అంటున్నారు. కానీ అతడు లెఫ్ట్ హ్యాండర్లకు బౌలింగ్ వేసేటప్పుడు ఇబ్బంది పడ్డారు. బోలాండ్ టీంలోకి రావడం ఆస్ట్రేలియా అదృష్టం. అతడు లేకుంటే భారత్ గెలిచేది’ అని చెప్పారు. కాగా హేజిల్‌వుడ్‌కు గాయం కావడంతో బోలాండ్ టీంలోకి వచ్చి 3 టెస్టుల్లో 21 వికెట్లు తీశారు.

News January 17, 2025

కోటి దాటిన టీడీపీ సభ్యత్వాలు.. లోకేశ్ ట్వీట్

image

AP: TDP సభ్యత్వాలు కోటి దాటినందుకు మంత్రి లోకేశ్ స్పెషల్ ట్వీట్ చేశారు. ‘రికార్డులు సృష్టించాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా టీడీపీ కార్యకర్తలకే సాధ్యం. పీక మీద కత్తి పెట్టి వేరే పార్టీ అధినేతకు జై కొడితే విడిచిపెడతామని చెప్పినా జై చంద్రబాబు, జై టీడీపీ అంటూ ప్రాణత్యాగం చేసిన చంద్రయ్య నాకు ప్రతి క్షణం గుర్తొస్తారు. కార్యకర్తల అభిప్రాయాలను గౌరవించే ఒకే ఒక్క పార్టీ టీడీపీ’ అని ట్వీట్ చేశారు.