News April 6, 2024
25 మంది BRS MLAలు కాంగ్రెస్లో చేరబోతున్నారు: మంత్రి
TG: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కేసీఆర్ పొగరు వల్లే 104 ఎమ్మెల్యేల ఉన్న BRS.. 39కి వచ్చింది. ఇందులో 25 మంది కాంగ్రెస్లో చేరబోతున్నారు. కేసీఆర్ అహంకారమే ఆ పార్టీ దుస్థితికి కారణం’ అని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కేసీఆర్ వల్లే కరవు వచ్చిందని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ పాలనలోనే కృష్ణా జలాలు ఏపీకి అధికంగా తరలించారని ఉత్తమ్ ఆరోపించారు.
Similar News
News January 9, 2025
కొందరు అధికారుల వల్లే ఈ ఘటన: చంద్రబాబు
AP: తొక్కిసలాట ఘటన నేపథ్యంలో రేపు ఉదయం సీఎం చంద్రబాబు తిరుపతిలో పర్యటించనున్నారు. కొందరు అధికారుల వల్లే ఈ ఘటన జరిగిందని అన్నారు. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడంతో వారిపై అసంతృప్తితో పాటు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి మరోసారి జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు పరిహారం ఇస్తామని చెప్పారు. బాధితులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని ఆదేశించారు.
News January 9, 2025
రద్దీ కారణంగానే ముందుగా టోకెన్లు జారీ: TTD ఈవో
AP: రేపు ఉ.5 గంటలకు జారీ చేయాల్సిన టోకెన్లను భక్తుల రద్దీ కారణంగా ముందుగానే ప్రారంభించినట్లు టీటీడీ ఈవో శ్యామలారావు తెలిపారు. మరోవైపు ఎలాంటి బందోబస్తు లేకపోవడమే ఘటనకు కారణమని భక్తులు మండిపడుతున్నారు. ఈ ఘటనలో ఆరుగురు మరణించారు. వాస్తవానికి రేపు ఉ.5 గంటలకు ఈ నెల 10, 11, 12 తేదీలకు సంబంధించి 1.20 లక్షల టోకెన్లను భక్తులకు ఇవ్వాలని నిర్ణయించారు.
News January 9, 2025
అప్పుడే నా వివాహం: అనన్య పాండే
ఐదేళ్ల తర్వాతే తాను పెళ్లి పీటలు ఎక్కుతానని హీరోయిన్ అనన్య పాండే స్పష్టం చేశారు. ఫోర్బ్స్ ఇండియా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. ‘అందరిలాగే తప్పకుండా పెళ్లి చేసుకుంటా. కొత్త ఇల్లు నిర్మించుకోవాలి. ఇంటి నిండా కుక్కలను పెంచుకోవాలి. ఆ తర్వాత వివాహం చేసుకుంటా’ అని తెలిపారు. కాగా మాజీ మోడల్ వాకర్ బ్లాంకోతో అనన్య డేటింగ్ చేస్తున్నట్లు టాక్. అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లికి వీరిద్దరూ కలిసే హాజరయ్యారు.