News October 3, 2025
ఈయన ఆస్తి రూ.44 లక్షల కోట్లు

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సరికొత్త రికార్డ్ సాధించారు. నికర ఆస్తిలో $500 బిలియన్ మార్క్ దాటిన ఏకైక వ్యక్తిగా నిలిచారు. టెస్లా, స్పేస్‌ఎక్స్, X వంటి సంస్థల మార్కెట్ విలువ అనూహ్యంగా పెరగడమే దీనికి కారణం. 2020లో ఆయన నెట్‌వర్త్ $24.6B ఉండగా ఐదేళ్లలోనే ఇది $500B (₹44.38లక్షల కోట్లు) చేరడం గమనార్హం. కాగా మస్క్ 2033 నాటికి ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా నిలుస్తారని ఫోర్బ్స్ అంచనా వేసింది.
Similar News
News October 4, 2025
నార్త్ వెస్ట్రన్ రైల్వేలో 2,094 పోస్టులు

నార్త్ వెస్ట్రన్ రైల్వే RRC 2,094 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు నవంబర్ 2వరకు అప్లై చేసుకోవచ్చు. టెన్త్, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.100, SC,ST, దివ్యాంగులు ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు. వెబ్‌సైట్: https://rrcjaipur.in/
News October 4, 2025
స్టార్ కపుల్ జాబితాలోకి విజయ్-రష్మిక

నిన్న <<17907469>>నిశ్చితార్థం<<>> చేసుకున్న లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక సినీ సెలబ్రిటీ కపుల్ జాబితాలోకి చేరనున్నారు. టాలీవుడ్ నుంచి ఈ లిస్ట్‌లో నాగార్జున-అమల, శ్రీకాంత్-ఊహ, వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి, నాగచైతన్య-శోభిత తదితర స్టార్లు ఉన్నారు. బాలీవుడ్‌లో అజయ్ దేవగణ్-కాజోల్, రణ్‌బీర్ కపూర్-అలియా, రణ్‌వీర్ సింగ్-దీపికా, కత్రినా కైఫ్-విక్కీ కౌశల్, కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రా ఉన్న సంగతి తెలిసిందే.
News October 4, 2025
అసలే ట్రంప్.. ఆపై చేతిలో కొత్త ఆయుధం!

‘నోబెల్’ కోసం ట్రంప్ కరవని గడ్డి లేదు. IND-PAKతో పాటు 7యుద్ధాలు ఆపానని ప్రకటించుకున్న ‘ట్రంపరి’ చేష్టలు చూశాం. తాజాగా <<17908342>>ఇజ్రాయెల్-హమాస్<<>> యుద్ధం ముగిసేలా ఓ ముందడుగు పడింది. దీంతో ‘అసలే ట్రంప్.. ఆపై చేతిలో హమాస్-ఇజ్రాయెల్ ఆయుధం’ ఇక ఆయన్ను ఆపగలమా! అని SMలో చర్చ జరుగుతోంది. నోబెల్ కోసం దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు తెచ్చి, ఆపై వాటిని ఆపినట్లు ప్రకటించుకోవడానికైనా వెనుకాడరనే మీమ్స్ పుట్టుకొస్తున్నాయి.