News October 4, 2025

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News October 4, 2025

విశాఖలో HSBC బ్యాంకు!

image

AP: అతిపెద్ద విదేశీ బ్యాంకు HSBC వైజాగ్‌లో తమ బ్రాంచ్ ఏర్పాటు చేయనుంది. విశాఖతో పాటు దేశంలోని 20 ప్రాంతాల్లో తమ శాఖలను విస్తరించేందుకు RBI అనుమతిచ్చిందని HSBC వెల్లడించింది. అనువైన ప్రాంతంలో భవనం దొరగ్గానే విశాఖలో బ్రాంచ్ ఏర్పాటు చేస్తామని ఆ బ్యాంక్ ఇండియా ఇంటర్నేషనల్ అండ్ ప్రీమియం బ్యాంకింగ్ విభాగం హెడ్ సందీప్ బాత్రా తెలిపారు. ఈ 20 శాఖలు ఏర్పాటైతే దేశంలో తమ బ్రాంచుల సంఖ్య 46కు చేరుతుందన్నారు.

News October 4, 2025

నార్త్ వెస్ట్రన్ రైల్వేలో 2,094 పోస్టులు

image

నార్త్ వెస్ట్రన్ రైల్వే RRC 2,094 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు నవంబర్ 2వరకు అప్లై చేసుకోవచ్చు. టెన్త్, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.100, SC,ST, దివ్యాంగులు ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు. వెబ్‌సైట్: https://rrcjaipur.in/

News October 4, 2025

స్టార్ కపుల్ జాబితాలోకి విజయ్-రష్మిక

image

నిన్న <<17907469>>నిశ్చితార్థం<<>> చేసుకున్న లవ్ బర్డ్స్ విజయ్ దేవరకొండ, రష్మిక సినీ సెలబ్రిటీ కపుల్ జాబితాలోకి చేరనున్నారు. టాలీవుడ్ నుంచి ఈ లిస్ట్‌లో నాగార్జున-అమల, శ్రీకాంత్-ఊహ, వరుణ్ తేజ్-లావణ్య త్రిపాఠి, నాగచైతన్య-శోభిత తదితర స్టార్లు ఉన్నారు. బాలీవుడ్‌లో అజయ్ దేవగణ్-కాజోల్, రణ్‌బీర్ కపూర్-అలియా, రణ్‌వీర్ సింగ్-దీపికా, కత్రినా కైఫ్-విక్కీ కౌశల్, కియారా అద్వానీ-సిద్ధార్థ్ మల్హోత్రా ఉన్న సంగతి తెలిసిందే.