News October 4, 2025
నార్త్ వెస్ట్రన్ రైల్వేలో 2,094 పోస్టులు

నార్త్ వెస్ట్రన్ రైల్వే RRC 2,094 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు నవంబర్ 2వరకు అప్లై చేసుకోవచ్చు. టెన్త్, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.100, SC,ST, దివ్యాంగులు ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు. వెబ్‌సైట్: https://rrcjaipur.in/
Similar News
News October 4, 2025
రోహిత్ ఫ్యాన్స్‌కు హార్ట్ బ్రేక్!

భారత క్రికెట్ చరిత్రలో రోహిత్ శర్మ శకం ముగిసినట్లే కనిపిస్తోంది. ఇప్పటికే టెస్టులు, T20లకు వీడ్కోలు పలికిన హిట్‌మ్యాన్ వన్డేల్లో మాత్రమే కొనసాగుతూ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. AUSతో వన్డే సిరీస్‌కు ఆయనను కాదని <<17911822>>గిల్‌కు<<>> కెప్టెన్సీ అప్పగించడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఇక ఆసీస్ సిరీస్ తర్వాత హిట్‌మ్యాన్ వన్డేలకూ రిటైర్మెంట్ ప్రకటించే ఛాన్స్ ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మీరేమంటారు?
News October 4, 2025
ముగిసిన పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ

TG: పార్టీ ఫిరాయింపు కేసులో మరో ఇద్దరు ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ ముగిసింది. స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎదుట గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ ఇవాళ హాజరయ్యారు. వీరి అడ్వకేట్లను పిటిషనర్స్(BRS) తరఫు అడ్వకేట్లు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. ఇప్పటికే కాలే యాదయ్య, ప్రకాశ్ గౌడ్‌ల విచారణ ముగిసింది. దీంతో మరో నలుగురి ఎమ్మెల్యేల విచారణ కోసం త్వరలో షెడ్యూల్ విడుదలవనుంది.
News October 4, 2025
వన్డేల్లో కెప్టెన్‌గా రో‘హిట్’

వన్డే కెప్టెన్‌గా రోహిత్‌శర్మకు ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. అతడి కెప్టెన్సీలో టీమ్ ఇండియా 56 మ్యాచుల్లో 42 గెలిచి 12 మ్యాచుల్లో ఓడింది. ఒక మ్యాచ్ టై, మరోటి ఫలితం రాలేదు. రోహిత్ కెప్టెన్‌గా భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ(2025) గెలిచింది. వన్డే WC(2023) రన్నరప్‌గానూ నిలిచింది. 2024లో T20 వరల్డ్‌కప్ సాధించింది. అందులో ఫైనల్ మ్యాచ్ అనంతరం పొట్టి ఫార్మాట్‌కు హిట్‌మ్యాన్ రిటైర్మెంట్ ప్రకటించారు.