News October 5, 2025
వరంగల్: వేధిస్తే షీ టీంకు తెలియజేయండి!

మహిళలు, విద్యార్థినులను ఎవరైనా ఆకతాయిలు వేధిస్తే తక్షణమే షీ టీం పోలీసులకు సమాచారం ఇవ్వాలని షీ టీం ఎస్సై యాదగిరి తెలిపారు. వరంగల్ షీ టీం ఆధ్వర్యంలో హన్మకొండలోని ఓ షాపింగ్ మాల్ సిబ్బందికి షీ టీంతో పాటు డయల్ 100, మహిళల అక్రమ రవాణా, బాల్య వివాహాలు, సైబర్ క్రైం, టీసేఫ్ యాప్‌పై అవగాహన కల్పించారు. ఎవరైనా వేధిస్తే మౌనంగా ఉండకుండా షీ టీంకు తెలపాలని సూచించారు.
Similar News
News October 5, 2025
పెద్దిపాలెం హైవేపై యాక్సిడెంట్.. మహిళ మృతి

ఆనందపురం మండలం పెద్దిపాలెం జాతీయ రహదారిపై శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. భోగాపురం నుంచి మధురవాడ వైపు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న సన్యాసమ్మ (41) హఠాత్తుగా పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలు కొమ్మాది ప్రాంతానికి చెందిన రామసూరి భార్యగా పోలీసులు గుర్తించారు. ఘటనపై ఆనందపురం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News October 5, 2025
పెళ్లైన వారానికే సూసైడ్.. కారణమిదే!

TG: జగిత్యాల జిల్లా ఎర్దండిలో ప్రేమించి పెళ్లి చేసుకున్న గంగోత్రి(22) వారానికే <<17908971>>సూసైడ్<<>> చేసుకున్న విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే.. దసరా పండుగ రోజు భార్య గంగోత్రితో కలిసి భర్త సంతోష్ అత్తగారింటికి వెళ్లాడు. అక్కడ మటన్ తింటూ కూరలో కారం లేదని గంగోత్రిని భర్త తిట్టాడు. ఆపై భోజనం చేయకుండా భార్యతో ఇంటికి వచ్చేశాడు. ఈ కారణంతోనే మనస్తాపం చెంది యువతి ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
News October 5, 2025
NLG: ఎన్నికల ఏర్పాట్లు.. తీర్పుపై ఉత్కంఠ

జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. రిజర్వేషన్ల అంశంపై ఈ నెల 8న హైకోర్టు వెల్లడించబోయే తీర్పు కోసం రాజకీయ పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల పనులు ఊపందుకున్నాయి. ఈ ఎన్నికల్లో కేవలం 9 పార్టీలకే ఎన్నికల సంఘం గుర్తింపు ఇవ్వగా, వాటికి సంబంధించిన ఓటర్ల జాబితాలను ముద్రించి అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.