News October 5, 2025

సంగారెడ్డి: ఎన్నికల ఫిర్యాదుల కోసం సహాయ కేంద్రం

image

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కలెక్టర్ కార్యాలయంలో ఎన్నికల సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ ప్రావిణ్య తెలిపారు. ఎన్నికల ఉల్లంఘనలకు సంబంధించి 81253 52721 నంబరుకు ఫిర్యాదు చేయాలని ఆమె కోరారు. ఫిర్యాదుదారుల పేర్లను గోప్యంగా ఉంచుతామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు.

Similar News

News October 5, 2025

పెళ్లైన వారానికే సూసైడ్.. కారణమిదే!

image

TG: జగిత్యాల జిల్లా ఎర్దండిలో ప్రేమించి పెళ్లి చేసుకున్న గంగోత్రి(22) వారానికే <<17908971>>సూసైడ్<<>> చేసుకున్న విషయం తెలిసిందే. వివరాల్లోకి వెళ్తే.. దసరా పండుగ రోజు భార్య గంగోత్రితో కలిసి భర్త సంతోష్ అత్తగారింటికి వెళ్లాడు. అక్కడ మటన్‌ తింటూ కూరలో కారం లేదని గంగోత్రిని భర్త తిట్టాడు. ఆపై భోజనం చేయకుండా భార్యతో ఇంటికి వచ్చేశాడు. ఈ కారణంతోనే మనస్తాపం చెంది యువతి ఉరేసుకుని సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.

News October 5, 2025

NLG: ఎన్నికల ఏర్పాట్లు.. తీర్పుపై ఉత్కంఠ

image

జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. రిజర్వేషన్ల అంశంపై ఈ నెల 8న హైకోర్టు వెల్లడించబోయే తీర్పు కోసం రాజకీయ పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల పనులు ఊపందుకున్నాయి. ఈ ఎన్నికల్లో కేవలం 9 పార్టీలకే ఎన్నికల సంఘం గుర్తింపు ఇవ్వగా, వాటికి సంబంధించిన ఓటర్ల జాబితాలను ముద్రించి అందించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

News October 5, 2025

NLG: యాసంగి బోనస్ కోసం ఎదురుచూపులు

image

జిల్లాలో బోనస్ డబ్బుల కోసం రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఈ ఏడాది వానకాలం సీజన్ కోతల ప్రక్రియ ప్రారంభమైనా గత యాసంగి బోనస్‌ను విడుదల చేయకపోవడంపై రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతేడాది యాసంగి సీజన్లో 17.835 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు విక్రయించారు. వీరికి బోనస్ రూపంగా రూ.8.91 కోట్లను వారి ఖాతాలో చేయాల్సి ఉన్నా నేటి వరకు ప్రభుత్వ బోనస్ డబ్బులు చెల్లించలేదని రైతులు తెలిపారు.