News October 5, 2025

సూర్య నమస్కారాలు చేస్తే చదవాల్సిన మంత్రాలు

image

ఓం మిత్రాయ నమః । ఓం రవయే నమః ।
ఓం సూర్యాయ నమః । ఓం భానవే నమః ।
ఓం ఖగాయ నమః । ఓం పూష్ణే నమః ।
ఓం హిరణ్యగర్భాయ నమః । ఓం మరీచయే నమః ।
ఓం ఆదిత్యాయ నమః । ఓం సవిత్రే నమః ।
ఓం అర్కాయ నమః । ఓం భాస్కరాయ నమః ।
శ్లోకం:
ఆదిత్యస్య నమస్కారాన్ యే కుర్వంతి దినే దినే ।
ఆయుః ప్రజ్ఞాం బలం వీర్యం తేజస్తేషాం చ జాయతే ॥

Similar News

News October 5, 2025

లలిత సహస్ర నామాలు – వివరములు (2)

image

ఉద్యద్భాను సహస్రాభా, చతుర్బాహు సమన్వితా |
రాగస్వరూప పాశాఢ్యా, క్రోధాకారాంకుశోజ్జ్వలా ||
ఉద్యద్భాను సహస్రాభా: వేల సూర్యుల కాంతితో సమానమైన తేజస్సు గల మాతా!
చతుర్బాహు సమన్వితా: నాలుగు చేతులు కలిగి ఉన్న తల్లి!
రాగస్వరూప పాశాఢ్యా: అనురాగం అనే రూపంలో ఉన్న పాశాన్ని ధరించి ప్రకాశించే దేవి!
క్రోధాకారాంకుశోజ్జ్వలా: కోపమునకు ప్రతీకైన అంకుశమనే ఆయుధంలా ప్రకాశిస్తున్న దేవత!
<<-se>>#LSN<<>>

News October 5, 2025

MLC వద్దు.. MLA టికెటే ముద్దు!

image

TG: జూబ్లీ‌హిల్స్ బైపోల్ అభ్యర్థి కోసం కాంగ్రెస్ తలమునకలై ఉండగా అజారుద్దీన్ రూపంలో మరో చిక్కుముడి ఎదురవుతోంది. గవర్నర్ కోటాలో ఇస్తానన్న MLC పదవికి న్యాయపరమైన చిక్కులొచ్చే అవకాశం ఉందని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో తనను జూబ్లీహిల్స్ బరిలో దించాలని పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. తనను తప్పించేందుకు ఓ మంత్రి ప్రయత్నించారని, ఆయనపై ఇప్పటికే AICC నేతకు ఫిర్యాదు చేసినట్లు రాజకీయ వర్గాల్లో టాక్.

News October 5, 2025

జమ్మూ ఎయిమ్స్‌లో 80 ఉద్యోగాలు

image

జమ్మూలోని ఎయిమ్స్‌ 80 పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు ఈనెల 24లోగా అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని ఈనెల 28లోగా పంపాలి. ఇంటర్వ్యూ / రాత పరీక్ష /ఆబ్జెక్టివ్ ప్రమాణాల ఆధారంగా స్క్రీనింగ్ చేయవచ్చు. పోస్టును బట్టి DNB, MD/MS/DM/M.Ch ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50ఏళ్లు. వెబ్‌సైట్: https://www.aiimsjammu.edu.in/