News October 5, 2025

లలిత సహస్ర నామాలు – వివరములు (2)

image

ఉద్యద్భాను సహస్రాభా, చతుర్బాహు సమన్వితా |
రాగస్వరూప పాశాఢ్యా, క్రోధాకారాంకుశోజ్జ్వలా ||
ఉద్యద్భాను సహస్రాభా: వేల సూర్యుల కాంతితో సమానమైన తేజస్సు గల మాతా!
చతుర్బాహు సమన్వితా: నాలుగు చేతులు కలిగి ఉన్న తల్లి!
రాగస్వరూప పాశాఢ్యా: అనురాగం అనే రూపంలో ఉన్న పాశాన్ని ధరించి ప్రకాశించే దేవి!
క్రోధాకారాంకుశోజ్జ్వలా: కోపమునకు ప్రతీకైన అంకుశమనే ఆయుధంలా ప్రకాశిస్తున్న దేవత!
<<-se>>#LSN<<>>

Similar News

News October 5, 2025

ఛార్జీల పెంపుతో జంట నగరాల ప్రజలపై కక్ష సాధింపు: కేటీఆర్

image

TG: ఆర్టీసీ సిటీ బస్సు ఛార్జీల పెంపుపై BRS నేత KTR ధ్వజమెత్తారు. ఒకేసారి రూ.10 పెంచడం దుర్మార్గమని, నిత్యం ప్రయాణించే వారిపై నెలకు రూ.500 వరకు అదనపు భారం పడుతుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తిరస్కరించారని జంట నగరాల ప్రజలపై ఛార్జీల పెంపుతో కక్ష సాధింపు చర్యకు దిగారని మండిపడ్డారు. ఉచిత బస్సు పథకంతో RTCని దివాళా తీయించిన ప్రభుత్వం, ఇప్పుడు ప్రయాణికుడి నడ్డి విరవాలని చూడటం క్షమించరానిదని ఫైరయ్యారు.

News October 5, 2025

రేపు ఆకాశంలో అద్భుతం

image

అంతుచిక్కని ఆశ్చర్యాలెన్నో దాగిన నింగిలో సోమవారం ఓ అద్భుతం కన్పించనుంది. 2025లో తొలి సూపర్‌మూన్ OCT 6, 7 రాత్రుల్లో కనువిందు చేయనుంది. భూమి చుట్టూ చందమామ తిరుగుతూ కొన్నిసార్లు దగ్గరికి వస్తుంది. పౌర్ణమి రోజు కన్పించే చంద్రుడి కంటే ఈ సమయంలో మూన్ సైజు, వెలుగు ఎక్కువ. రేపు 14% సైజు, 30% వెలుగు అధికంగా ఉండే జాబిలిని సాధారణంగా చూడవచ్చు. ఈ ఏడాదిలో 3 సూపర్ మూన్లలో మిగతా 2 NOV, DECలో ఏర్పడతాయి.

News October 5, 2025

‘8’ సంఖ్యతో శ్రీకృష్ణుడి అనుబంధం

image

‘ఓం నమో నారాయణాయ’ అనే అష్టాక్షరీ మంత్రంలో ఉన్న ‘8’ సంఖ్య కృష్ణుడి జీవితంలో అత్యంత ప్రాధాన్యం కలిగి ఉంది. హరి 8వ అవతారంగా, దేవకీదేవికి 8వ సంతానంగా, ఆమె గర్భాన 8 మాసాలే ఉండి 8వ తిథి(అష్టమి)న కృష్ణుడు జన్మిస్తాడు. ఆయనకు 8 ధర్మపత్నులు. అప్పటివరకు అపశకునంగా భావించిన అష్టమి తిథికి ఆయన జననం గౌరవాన్ని చేకూర్చింది. 8 సంఖ్యకు ఉన్న అపవాదాన్ని తొలగించేందుకే కృష్ణుడు అష్టమిన పుట్టాడని నమ్ముతారు. <<-se>>#Sankhya<<>>